తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మహా కూటమితో కలిసి పోటీ చేస్తుందా లేక కూటమిలోంచి బయటికొచ్చేస్తుందా అనే అంశంపై ఆ పార్టీ నేత చాడ వెంకట రెడ్డి స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్లోని ఫార్చ్యూన్ హోటల్లో టీడీపీ నేత ఎల్.రమణతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని అన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా కూటమిని ఏర్పాటు చేశాం కనుక సీట్ల కేటాయింపు విషయంలో కాస్త పట్టువిడుపులు తప్పవని చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.
కూటమిలో సీపీఐకి కాంగ్రెస్, టీడీపీ కేటాయించిన సీట్ల కేటాయింపు అంశం గురించి చాడ మాట్లాడుతూ.. ''కూటమి కొంత ఏకపక్షంగా వ్యవహరించడంపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. కూటమి నుంచి బయటకి వెళ్ళాలని మాత్రం అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ను గద్దె దించడం కోసం కూటమితో కలిసి పనిచేస్తామని చాడ అన్నారు.