Gandhi hospital: గాంధీలో కరోనా పేషెంట్ డెడ్‌బాడీ మిస్సింగ్

COVID-19 patient deadbody missing : హైదరాబాద్: కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రి ( Gandhi hospital) ఇటీవల పదేపదే వార్తల్లో నిలుస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్-19 చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి మృతదేహం అదృశ్యమైందనే వార్తలు కలకలంరేపుతున్నాయి.

Last Updated : Jun 11, 2020, 02:54 PM IST
Gandhi hospital: గాంధీలో కరోనా పేషెంట్ డెడ్‌బాడీ మిస్సింగ్

COVID-19 patient deadbody missing : హైదరాబాద్: కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రి ( Gandhi hospital) ఇటీవల పదేపదే వార్తల్లో నిలుస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్-19 చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి మృతదేహం అదృశ్యమైందనే వార్తలు కలకలంరేపుతున్నాయి. హైదరాబాద్ మెహిదీపట్నం వాసి రషీద్ అలీ ఖాన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా గాంధీ ఆస్పత్రి నుంచి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందిందని.. రషీద్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికని వెళ్లిన తమకు గాంధీ ఆస్పత్రిలో ఎంత వెతికినా శవం కనిపించలేదని అతడి సోదరుడు అమీర్ చెప్పినట్టుగా ఉన్న ఓ వీడియో సైతం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. హార్ట్ ఎటాక్‌తో యువ దర్శకుడు మృతి )

బుధవారం ఉదయం రషీద్ చనిపోయినట్టుగా గాంధీ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చిందని.. మృతదేహం కోసం వెళ్తే సాయంత్రం ఈ విషయం తెలిసిందని రషీద్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆస్పత్రి మార్చురీలో ఉన్న 18 శవాలను పరీక్షించినప్పటికీ.. అందులో రషీద్ మృతదేహం కనిపించకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందంటున్నారు అతడి కుటుంబసభ్యులు. గాంధీ ఆస్పత్రి రోగి మృతదేహం అదృశ్యమవడం ( Deadbody missing) తీవ్ర గందరగోళానికి దారితీసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News