Telangana COVID-19 updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

COVID-19 cases reported in telangana: హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూవస్తోంది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తెలంగాణలో అంతకుముందు గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,362 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2021, 09:46 AM IST
Telangana COVID-19 updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

COVID-19 cases reported in telangana: హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూవస్తోంది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తెలంగాణలో అంతకుముందు గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,362 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో మరో 10 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 6,12,196 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 3,556 మంది చనిపోయారు. 

Also read : Schools reopening in Telangana: స్కూల్స్ పునఃప్రారంభంపై కేబినెట్ భేటీలో నిర్ణయం

అదే సమయంలో 1897 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనావైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 5,90,072 మందికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జూన్ 19 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండగా జూన్ 20 నుంచి లాక్ డౌన్ ముగిసి అన్‌లాక్ (Telangana unlock) చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also read : Telangana unlock, HMRL, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ బస్సుల టైమింగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News