covaxin trials: హైదరాబాద్ : భారత్ ఫార్మా దిగ్గజం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ( Bharat Biotech ) సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయి. కరోనావైరస్ ( Coronavirus ) ను కట్టడి చేసేందుకు మొదటి దశలో భాగంగా దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఈ టీకాను దాదాపు 60మంది వలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. అయితే ఈ కోవాక్సిన్‌ను సోమవారం ప్రయోగాత్మకంగా తీసుకున్న ఇద్దరు వలంటీర్లు మంగళవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Also read: Covid-19: అమర్‌నాథ్ యాత్ర రద్దు
ఈ వ్యాక్సిన్ డోస్‌ను ఇచ్చిన అనంతరం ఆ ఇద్దరిని వైద్యులు 24 గంటలపాటు పర్యవేక్షించారు. వారికి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించకపోవడంతో మంగళవారం వారిని డిశ్చార్జ్ చేశారు. మరో 14 రోజులు పాటు వారిద్దరు హోం క్వారంటైన్‌లో ఉంటూ.. వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఆ తర్వాత వారి బ్లడ్ శాంపిళ్లను పరీక్షించనున్నారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన నాటినుంచి కరోనాతో పోరాడేందుకు వారి శరీరంలో ఏ మేరకు యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి.. ఎలాంటి సమస్యలైనా ఉత్పన్నమయ్యాయా లేదా అనేది పరిశీలించనున్నారు. Also read: Political Science: వేర్పాటువాదం చాప్టర్‌ను తొలగించిన NCERT
కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నేడు మరో ఇద్దరు వలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ మూడు దశల పరీక్షల్లో కూడా విజయవంతమైతే.. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ కోవాక్సిన్‌ను భారత్ బయోటెక్ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సహకారంతో అభివృద్ధి చేసింది. Also read: IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు