Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ వేయి మార్క్ దాటాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 18న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Covid-19: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,60,834 కి చేరగా.. మరణాల సంఖ్య 1,419 కి పెరిగింది. అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 1,440 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,46,733 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 12,682 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.59 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్
ఇదిలావుంటే.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 38,757 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 18వ తేదీ వరకు మొత్తం 50,11,164 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ పరిధిలో 168 కేసులు నమోదయ్యాయి.
Telangana Covid-19: కొత్తగా 1058 కరోనా కేసులు