తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం.

Last Updated : Apr 26, 2020, 01:20 AM IST
తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం. శనివారం నాడు తెలంగాణలో 7 కేసులు మాత్రమే నమోదవడం సర్కార్‌కు కొంత ఊరటనిచ్చింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 కేసులు ఉండగా, వరంగల్‌ అర్బన్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య 990కి చేరాయి. 

Also read : COVID-19: తెలంగాణలో కోవిడ్ నివారణపై కేంద్రం ఆరా

తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 25 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 307 మంది రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా మరో 658 మందికి చికిత్స అందిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News