హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పలువురు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు ప్రగతిభవన్లో కలిసి ఇందుకు సంబంధించిన చెక్కులను అందించారు. సుమారు 25 మంది 6 కోట్ల 80 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి విరాళాల రూపంలో అందాయి.
Read Also: ఫ్లైట్ టికెట్ బుక్ చేశారా? మీ డబ్బులు రీఫండ్ కాకపోవచ్చు.. కానీ...
విజ్ రియల్టర్స్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కోటి రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ కి అందించారు. ఏన్ సైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి రూపాయల చెక్కును అందించారు. పెన్నా సిమెంట్స్ సైతం కోటి రూపాయలను మాజీ మంత్రి దానం నాగేందర్ ఆధ్వర్యంలో అందించారు. రత్నదీప్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.
రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న సుజన చారిటబుల్ ట్రస్ట్ సైతం 50 లక్షల రూపాయలను, ఇందుకు సంబంధించిన చెక్కును సుజనా చౌదరి మంత్రి కేటీఆర్ ని కలిసి ప్రగతిభవన్ లో చెక్కును అందజేశారు. జెమిని ఈడిబుల్స్ అండ్ ప్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50 లక్షల చెక్కును, దొడ్ల డైరీ లిమిటెడ్, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, వశిష్ట కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గాయత్రి గ్రానైట్స్ ఒక్కొక్కరు 25 లక్షల రూపాయల చెక్కులను అందించారు. అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 21 లక్షలు, నీరూస్ ఏన్ సెంబుల్స్ 20లక్షలు, రిజెనెసిస్ ఇండస్ట్రిస్ 10 లక్షలు సిక్కు రూపంలో అందించింది.
హైదరాబాద్ నగరంలోని పిఓటి మార్కెట్ లో వృత్తి పని చేసుకుంటున్న స్వర్ణకారులు సుమారు 39 మంది కలిసి ఏడు లక్షల 32 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి ప్రత్యేకంగా అందించారు. ఈ మేరకు వారు చెక్కులను మంత్రి కేటీఆర్ కు అందజేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..