Gym Trainer: హైదరాబాద్ పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. జిమ్ ట్రైనర్ ను కిరాతకంగా కొట్టారు. ఖాకీల కిరాతకంతో బాధితుడి కాలు విరిగిపోయింది. సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడలో ఈ దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ పోలీసులు విచక్షిణారహితంగా కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో జిమ్ ట్రైనర్ ను నలుగురు పోలీసులు రౌండప్ చేశారు. జిమ్ ట్రైనర్ రెండు కాళ్ల మధ్య పెద్ద కర్ర పెట్టి దారుణంగా కొడుతున్నారు. కిందపడిపోయిన బాధితుడిని బూటు కాళ్లతో ఇష్టారీతిగా తన్నుతున్నారు కానిస్టేబుళ్లు. పోలీసుల దాడిలో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన జిమ్ ట్రైనర్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితుడు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఈనెల3(జూన్3)న జిమ్ ట్రైనర్ ఆరోఖ్యరాజ్ కు బైక్ విషయంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. తర్వాత బైకర్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో నలుగురు పోలీసులు జిమ్ ట్రైనర్ ఇంటికి వచ్చారు. పోలీస్‌స్టేషన్‌కు రావాలన్నారు. అయితే రాత్రి రాలేనని.. ఉదయం వస్తానని చెప్పాడు ఆరోఖ్యరాజ్. దీంతో కోపంతో నలుగురు పోలీసులు అతనిపై దాడికి పాల్పడ్డారు. రోడ్డు మీదే దాడికి దిగారు.తమకు ఎదురు చెబుతావా అంటూ కర్రలతో కొట్టారు. కిందపడిపోయిన ఆరోఖ్యరాజ్ బూటుకాళ్లతో తన్నారు. నలుగురు కానిస్టేబుళ్లు రౌండప్ చేసి మరీ దాడి చేయడంతో బాధితుడికి తీవ్ర గాయలయ్యాయి.
తనను కొట్టొద్దని బాధితుడు వేడుకున్నా, ఆరోఖ్యరాజ్ తల్లి కాళ్లు పట్టుకుని ప్రాదేయపడినా పోలీసులు వినలేదని స్థానికులు చెబుతున్నారు. ఖాకీల దాడిలో జిమ్ ట్రైనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి శరీరమంతా గాయాలు కనిపిస్తున్నాయి. కర్రలతో కొట్టడంతో కాలు విరిగిపోయింది. కానిస్టేబుళ్ల దాడిని చూసిన కాలనీవాసులు భారీగా రావడంతో పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. గాయాలతో పడి ఉన్న ఆరోఖ్యరాజ్ ను కాలనీ వాసులే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు దెబ్బలకు ఆరోఖ్యరాజ్ ఎడమ కాలు విరిగిపోయిందని గాంధీ వైద్యులు చెప్పారు. మంగళవారం అతనికి సర్జరీ చేయనున్నారు.
జిమ్ ట్రైనర్ ను పోలీసులు కొడుతుండగా స్థానికుల్లో ఒకరు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను చూసిన జనాలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. దాడి విజువల్స్ వైరల్ కావడంతో కానిస్టేబుళ్లు బాధితుడి దగ్గరకు వచ్చి బేరసారాలకు దిగారని తెలుస్తోంది. ఈ ఘటనను ఇక్కడితో వదిలేయాలని కోరినట్లు చెబుతున్నారు. స్టేషన్ కు రమ్మన్న తమపై దాడికి ప్రయత్నించడం వల్లే తాము తిరిగి దాడి చేశామని పోలీసులు కవర్ చేసుకుంటున్నారు. హాస్పిటల్ ఖర్చులు కూడా తమే భరిస్తామని కానిస్టేబుళ్లు చెప్పారని స్థానికులు అంటున్నారు. జిమ్ ట్రైనర్ పై దాడికి దిగిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Complaint On Dog: ఫిర్యాదు చూసి తల పట్టుకున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?
READ ALSO: Hyderabad Gang Rape: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు? గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook