Revanth Reddy Open Letter To Telangana CM KCR: రాష్ట్రంలో పింఛన్ అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పింఛన్‌దారుల అర్హత వయసును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తానని, రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని గుర్తుచేశారు.
ఈ మేరకు తెలంగాణలో పింఛన్‌దారుల అర్హత వయసును తగ్గించడంతో పలు అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రచార హడావుడి, ఆర్భాటం ఎక్కువని, పనితనం తక్కువ అని ఎద్దేవా చేశారు. భర్తను కోల్పోయిన ఒంటరి మహిళలకు సైతం పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం
ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడమే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలన్న ఆలోచన ఎందుకు లేదని ప్రశ్నించారు. ఓ ఇంట్లో ఇద్దరు పింఛన్ వయసు వ్యక్తులు ఉంటే వారిద్దరికి పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్(Telangana CM KCR)కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook