ఆర్టీసీని బంధువుల చేతిలో పెట్టేందుకే కేసీఆర్ కుట్ర: జీవన్ రెడ్డి

ఆర్టీసీని బంధువుల చేతిలో పెట్టేందుకే కేసీఆర్ కుట్ర: జీవన్ రెడ్డి

Last Updated : Oct 24, 2019, 04:32 PM IST
ఆర్టీసీని బంధువుల చేతిలో పెట్టేందుకే కేసీఆర్ కుట్ర: జీవన్ రెడ్డి

ఆదిలాబాద్: ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి ఆ సంస్థను బంధువుల చేతిలో పెట్టేందుకే సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం 20వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో జిల్లాలోని ఉట్నూర్ అంబేద్కర్ చౌక్‌లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించే వరకు మాకు అండగా ఉండి పోరాడతామని కార్మికులకు భరోసా ఇచ్చారు.

Trending News