హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే సీతక్క ( MLA seethakka arrested ) కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఆమెతో కలిసి ఆందోళనలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందుగా తనని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సీతక్క ప్రతిఘటించడంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. Also read : YSRCP MLA Talari Venkat Rao: వైసిపి ఎమ్మెల్యేపై కేసు నమోదు
Is seethakka terrorist? See the way how they arrest seethakka near Pragathi Bhavan CM KCR Residence.
Seethakka went their to protest to support farmers..@INCIndia @RahulGandhi @MahilaCongress @manickamtagore @priyankagandhi @sushmitadevinc @UttamTPCC @revanth_anumula pic.twitter.com/wMzTlYo15A— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 18, 2020
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు భారీ మొత్తంలో పంట నష్టపోయారని.. రైతులకు పంట నష్ట పరిహారం ( Compensation to farmers ) చెల్లించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను ( Crop loans ) ఏకకాలంలో మాఫీ చేయాలనే కాంగ్రెస్ పార్టీ డిమాండుని సైతం ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ( Telangana assembly session ) ప్రజా సమస్యలపై చర్చ జరగనేలేదని.. కనీసం ఇక్కడైనా చెప్పుకుందామని వస్తే పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ఇలా ఎంత కాలం పోలీసుల చేత అడ్డుకుంటారని సీతక్క ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో నిరసనకు దిగే హక్కు కూడా లేదా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. Also read : Paytm APP: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...
- Fine for not wearing mask in car: కారులో వెళ్తున్న న్యాయవాది మాస్కు ధరించలేదని ఛలానా
-
Pragathi Bhavan: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
-
Krishna River: కృష్ణానదిపై మరో రెండు బ్యారేజ్ లకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR