CM Revanth reddy will launch former pm Rajiv Gandhi statue: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తుంది. ఈక్రమంలో..ఒక వైపు గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తునే.. మరోవైపు సీఎం రేవంత్ అపోసిషన్ పార్టీ బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో.. సచివాలయం ముందు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానం ఏర్పాటు చేశారు. దీని ఆవిష్కరణకు.. కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు రావోచ్చని ప్రచారం జరిగింది.
కానీ అనూహ్యంగా వారు రావడం మీద సస్సెన్స్ ఏర్పడింది.ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని సచివాలయం ముందు రేపు (సోమవారం) సాయంత్రం రాజీవ్ గాంధీ విగ్రహానంను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని కూడా సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అయితే.. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ నేత.. రాజీవ్ గాంధీ విగ్రహాం ఆవిష్కరణ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలసిందే.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. తెలంగాణకు ఏ మాత్రం సంబంధంలేని వ్యక్తిని తీసుకొచ్చి.. తెలంగాణ తల్లివిగ్రహాన్ని ఏర్పాటు కోసం ఉంచిన స్థలంలో.. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తామ ప్రభుత్వం మరల రావడం ఖాయమని, అప్పుడు మాత్రం సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలిస్తామన్నారు.
Read more: Khairatabad: ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర తొక్కిసలాట.. చేతులెత్తేసిన ఉత్సవ కమిటీ.. వీడియో వైరల్...
ఆ తర్వాత.. హైదరబాద్ లో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేరుతో ఉన్న ప్రతి ఒక్కసముదాయం పేరు మారుస్తామని హెచ్చరించారు. మరోవైపు రేపు తెలంగాణ సెక్రెటెరియట్ ముందు.. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు నేపథ్యంలో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.