Telangana Cabinet: అక్టోబర్ 10న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రగతి భ‌వ‌న్‌లో ( Pragathi Bhavan ) జరగనున్న సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు.

Last Updated : Oct 9, 2020, 01:11 PM IST
    • తెలంగాణ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు జరగనుంది.
    • ప్రగతి భ‌వ‌న్‌లో జరగనున్న సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు.
    • అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్ట సవరణ బిల్లును కేబినెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది.
Telangana Cabinet: అక్టోబర్ 10న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రగతి భ‌వ‌న్‌లో ( Pragathi Bhavan ) జరగనున్న  ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్ట సవరణ బిల్లును కేబినెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. దీంతో పాటు పంటల సాగు విషయంలో అమలు చేయాల్సిన విధానాలు, ధాన్యం కొనుగొలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. 

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అవ్వడానికి ముందే మధ్యాహ్నం వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇందులో గ్రామాల్లోనే పంటల కొనుగోలు అంశంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు లాభదాయకమైన పంటలను పండించే అంశంపై చర్చించనున్నారని సమాచారం. 

కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
దేశ అవసరాల కోసం కేంద్రం భారీగా మొక్కజొన్నను బయటి దేశాల నుంచి దిగుమతి చేస్తోంది. దీంతో స్థానిక పంటలపై ప్రభావం ఉంటుంది. దీంతో తెలంగాణ ( Telangana ) మొక్కజొన్న సాగుపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గ్రామాల నుంచి పంటలను కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దానిపై సమీక్ష నిర్వహించనున్నారు అని తెలుస్తోంది. 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

గ్రామాల నుంచి పంటలు కొనుగోలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతలకు ఉపశమనం కలిగించాలి అని.. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News