Telangana: ఆ బస్సులకు గులాబీ రంగు తొలగించండి: CM KCR

మహిళల బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. 

Last Updated : Jul 23, 2020, 02:16 PM IST
Telangana: ఆ బస్సులకు గులాబీ రంగు తొలగించండి: CM KCR

bio toilets on wheels: హైదరాబాద్‌ : మహిళల బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు  ( CM KCR ) ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ( Puvvada Ajay Kumar ) కు పలు సూచనలు చేశారు. గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి అజయ్‌తో సీఎం కేసీఆర్‌ ఫోన్‌‌లో సంభాషించారు. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులకు గులాబీ రంగు ఉండకుండా చూడాలని మంత్రికి సీఎం కేసీఆర్ సూచించారు. Also read: Telangana: మంత్రి హరీశ్ రావుకు కీలక బాధ్యతలు

సీఎం కేసీఆర్ ఆదేశాలతో వెంటనే బస్సులకు ఉన్న గులాబీ రంగులు మార్చాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ అధికారులకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా రంగును మార్చాలని ఆయన పలు సూచనలు సైతం చేశారు.  Also read: COVID-19: అప్పటి వరకు వ్యాక్సిన్‌ ఆశించొద్దు: WHO

అయితే.. ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్ బస్సులను బుధవారం మంత్రి అజయ్‌ కుమార్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బయో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అయితే మంత్రి కేటీఆర్ సూచనల మేరకే గులాబీ రంగును బస్సులకు వేశామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్న మరునాడే.. రంగులు మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.   Also read: TSPSC recruitment: టిఎస్పీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Trending News