CM KCR Speech at Telangana Integration తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ ఆవశ్యకత, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మత విద్వేషాలు, మతాన్ని అడ్డుపెట్టుకుని ఆటలు ఆడుతున్న రాజకీయ పార్టీల విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిన తీరు గురించి సమగ్రంగా వివరించారు.
తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,78, 833లకు పెరిగిందని అన్నారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం మనదే అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఒకప్పుడు రాచరిక వ్యవస్థలో ఉందని, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చిందని అన్నారు. ఆనాడు ఉజ్వల ఉద్యమం నడిచిందని, ఆ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేసుకున్నారు.
కుమ్రం భీం, దొడ్డి కొమురయ్య ప్రాణత్యాగాలు మరవలేనివని, అమర వీరులు తమ తమ త్యాగాలతో చరిత్రను వెలిగించేలా చేశారని కొనియాడారు. దేశంలో ఒక మార్పు కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, మతవిద్వేషాలను రెచ్చగొట్టేవారి ఆటలు కట్టుపెట్టిస్తామని అన్నారు. శాంతియుతంగా సామరస్యంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని కోరుకున్నారు.
దేశంలో కులమతాల చిచ్చు పెట్టి గెలవడం అలవాటైందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అనే విషయం మీద ట్రైనింగ్ క్లాసులు ఇవ్వబోతోన్నామని కేసీఆర్ తెలిపారు. విశాఖ ఉక్కుని బీజేపీ ప్రయివేటీకరణ చేసినా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాతీయం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM KCR Speech : దేశానికే టార్చ్ బేరర్‌గా తెలంగాణ.. అందుకే బీఆర్‌ఎస్ పార్టీని ప్రారంభించా... సీఎం కేసీఆర్
తెలంగాణ సమైక్యత వజ్రోత్స వేడుకలు
బీఆర్‌ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ కామెంట్స్
మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపణలు