CM KCR On Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త. రెండో విడత రైతు బంధు సాయానికి సన్నాహాలు చేయమని అధికారులకు ఆదేశం జారీ చేశారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించిన ఆయన రైతు బంధు కోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రైతులకు రెండో విడత రైతు బంధు (Rythu Bandhu) సహాయాన్ని డిసెంబర్ 27, 2020 నుంచి జనవరి 7, 2021 వరకు అందించనున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రతీ రైతుకు లాభం కలగాలి అని, రైతుల ఖాతాల్లో డబ్బు నేరుగా డిపాజిట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డబ్బును విడుదల చేయాలి అని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే
ముందుగా తక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులకు (Farmers) ఈ సాయం అందించాలి అని, తరువాత ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి అందించాలి అని అన్నారు కేసీఆర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe