CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

TRS Meeting: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం రానుందా..? పార్టీ నాయకులతో సడెన్‌గా సీఎం కేసీఆర్ ఎందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు..? కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారా..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 11:47 AM IST
CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

TRS Meeting: ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం నిర్వహించనున్న మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరగనున్న మీటింగ్‌కు పార్టీ నేతలంతా హాజరుకానుండడం చర్చనీయాంశంగా మారింది. 
టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీతో పాటు టీఆర్ఎస్‌ కార్యవర్గంతో సంయుక్తంగా కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. 

ఇంత సడెన్‌గా పార్టీ నేతలు అందరితో టీఆర్ఎస్ అధినేత ఎందుకు సమావేశం నిర్వహిస్తురనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుందంటారు. అసలు ఆయన పార్టీ సమావేశాలు చాలా తక్కువగా నిర్వహిస్తుంటారు. అలాంటిది లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్‌ కార్యవర్గం సమావేశం సంయుక్తంగా నిర్వహిస్తుండటంతో ఏదో కీలక నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది. 

కేసీఆర్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు గెలుపు తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. 2018లోనూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ఈసారి కూడా ముందస్తుకు వెళ్లవచ్చనే చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. 

దీంతో మంగళవారం జరిగే సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలపై పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది. నేటి  భేటీలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుంటారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

తెలంగాణ పాలనలో కీలక మార్పులు జరగవచ్చనే ప్రచారం కొన్ని వర్గాల నుంచి వస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో పాలనా పగ్గాల నుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం దిశగా జాతీయ స్థాయిలో అడుగులు వేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ ఓపెన్‌గానే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్‌కు పట్టాభిషేకం దిశగా కేసీఆర్ చర్యలు ఉండబోతున్నాయని.. మంగళవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే టాక్ వస్తోంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేటీఆర్ నాయకత్వంలోనే సాగుతాయని కొందరు గులాబీ నేతలు చెబుతున్నారు. 

అటు  జాతీయ రాజకీయాలపై పార్టీ నేతలకు కేసీఆర్ కీలక సందేశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌ పార్టీకి ఆమోదం రాగానే పార్టీ నేతలు ఎలా పనిచేయాలి..? పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం వెలుగు చూడటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ చేసిన కామెంట్లపైనా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని అంటున్నారు.

Also Read: Kolhapur Groom Protest:  సైకిల్‌పై పెళ్లికొడుకు ఊరేగింపు.. ఇదెక్కిడి నిరసన సామీ..!  

Also Read: Englad Win World Cup: ఫైనల్లో పాక్ చిత్తు.. విశ్వవిజేతగా ఇంగ్లాండ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News