MLC Patnam Mahender Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి బెర్త్ ఫిక్స్..!

Telangana Cabinet Expansion: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిమండలిలో మరోసారి చోటు దక్కింది. తాండూర్ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డికి మంత్రి అవకాశం కల్పించనున్నారు సీఎం కేసీఆర్. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 23, 2023, 10:13 PM IST
MLC Patnam Mahender Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి బెర్త్ ఫిక్స్..!

Telangana Cabinet Expansion: తెలంగాణలో ఎన్నికల ముంగిట సీఎం కేసీఆర్ కేబినెట్‌ను విస్తరించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో  రంగారెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి మరో మారుసారి దక్కనుంది. రానున్న ఎన్నికల్లో భాగంగా తాండూర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు పట్నం మహేందర్ రెడ్డి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఖరారు చేయడంతో మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఈటల రాజేందర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పదవిని మళ్లీ భర్తీ చేయలేదు. ఇప్పుడు మహేందర్ రెడ్డితో ఆ స్థానాన్ని భర్తీ చేయంచనున్నారు కేసీఆర్. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడం మహేందర్ రెడ్డి రెండవసారి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి కేబినెట్‌లో  రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 వరకు మంత్రిగా ఆయన కొనసాగారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అనంతరం మహేందర్ రెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జూన్ 2019లో ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాతో పాటు తాండూర్ రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉన్నారు. మరోసారి ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకోగా.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన పైలట్ రోహిత్ రెడ్డికే గులాబీ బాస్ టికెట్ ఇచ్చారు. చివరి వరకు టికెట్‌ కోసం ప్రయత్నించి మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉండగా.. కేసీఆర్ మంత్రి పదవిని అప్పగించనున్నారు.

మహేందర్ రెడ్డితోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్‌కి కూడా కేబినెట్‌లోకి స్థానం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి స్థానాన్ని సీఎం కేసీఆర్ కోసం ఆయన త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన త్యాగానికి గుర్తుగా మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే రేపు పట్నం మహేందర్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. చివరి నిమిషంలో మార్పులేమైనా చోటు చేసుకుంటాయామో చూడాలి మరి. 

Also Read: Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధం  

 Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News