Telangana CM KCR: రాష్ట్రం కోసం నీళ్ల యుద్ధమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణకు చెందాల్సిన చుక్క నీటి బొట్టును కూడా వదులుకోము, అవసరమైతే యుద్దం చేస్తామంటూ సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని భట్టి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ
రాయలసీమ లిప్ట్ సంగమేశ్వరం పేరుతో నీళ్ల కోసం ఏడాది కిందట ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిందని, సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 11 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకుపోతుండగా, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు పడ్డట్లుగా (Telangana CM KCR) టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం నీళ్లు, నిధులు, నియమాకాలు అని ఉద్యమం సమయంలో మాటలు చెప్పారని, కానీ ఆయన కుటుంబ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కనిపించడం లేదన్నారు. రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు ఏపీ నీళ్లను పెంచుతూ జీవోలు తీసుకొస్తే, తెలంగాణ సర్కార్ మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ సామర్థ్యాన్ని 2 నుంచి 1 టీఎంసీకి తగ్గిస్తూ అత్యవసరం ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు.
Also Read: Telangana high court: Schools reopening పై తెలంగాణ సర్కారుకు హై కోర్టు ప్రశ్నలు
సంగమేశ్వరం నుంచి నీళ్లు తరలిపోతే శ్రీశైలం నిండదని, ఆ ప్రాజెక్టు మీద ఆధారపడ్డ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, భీమా, కోయిల్ సాగర్, ఎస్.ఎల్.బీ.సీలు ఎప్పుడు నిండుతాయని ప్రశ్నించారు. వాటి మీద ఆధారపడ్డ లక్షల ఎకరాలు ఎండిపోతాయన్నారు. సాగర్ లెఫ్ట్ కెనాల్‌లో ఆరున్నర లక్షల ఎకరాలు ఎండిపోయాయని, వాటితో పాటు హైదరాబాద్(Telangana)కు మంచినీళ్లు కూడా దొరకవని పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి కమిటీ, అపెక్స్ కమిటీ మీటింగ్ చేస్తే వెళ్లకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం టెండర్లు పూర్తయ్యే వరకూ కేసీఆర్ అపెక్స్ మీటింగ్ వద్దని ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రయోజనాలకు ఫణంగా పెట్టారని ఆరోపించారు.
Also Read: Covid Treatment Charges: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షల ధరల వివరాలివీ
ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ద్వారా ప్రజలకు నీళ్లు అందుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ తుపాకీ రాముడిలా గ్రామాల్లో తిరుగతూ ప్రగల్బాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. పారాసెట్‌మల్ ట్యాబ్లెట్ వేసుకుంటే కోవిడ్-19 తగ్గుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ హాస్పిటల్ బిల్లు రూ.28 లక్షలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హరీష్ రావు మాటలకే పరిమితమని, చెప్పేవి అమలులో ఉండవన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇస్తూ సీఎం కేసీఆర్ ప్రజల్ని మభ్యపెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
Also Read: Double Bedroom Houses: డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి Puvvada Ajay Kumar
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Telangana: నీళ్ల యుద్ధమంటూ CM KCR కొత్త డ్రామా, సీఎల్పీ నేత Bhatti Vikramarka ఫైర్
నీళ్ల యుద్ధమంటూ సీఎం కేసీఆర్ కొత్త డ్రామా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే, తెలంగాణ సర్కార్ వాటా తగ్గిస్తోంది
సంగమేశ్వరం నుంచి నీళ్లు తరలిపోతే శ్రీశైలం నిండదన్న సీఎల్పీ నేత భట్టి