చిక్కుల్లో తెరాస నేత చెన్నమనేని రమేష్

తెలంగాణ రాష్ట్ర సమితి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ, ఆ దేశ పాస్ పోర్టుతో మద్రాస్ నుండి జర్మనీ వెళ్లినట్టు కోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది.   

Last Updated : Feb 10, 2020, 08:06 PM IST
చిక్కుల్లో తెరాస నేత చెన్నమనేని రమేష్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ, ఆ దేశ పాస్ పోర్టుతో మద్రాస్ నుండి జర్మనీ వెళ్లినట్టు కోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది. 

భారత పౌరసత్వం ఉందని జర్మనీ పాస్ పోర్టుతో ఎందుకు వెళ్లావని చెన్నమనేని రమేష్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికీ జర్మనీ పాస్ పోర్టుతోనే విదేశాలకు వెళ్లినట్టు కేంద్ర హోంశాఖ కోర్టుకు తెలిపింది. 

కాగా, జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు చెన్నమనేని రమేష్ కోర్టుకు తెలిపారు. అయితే, జర్మనీ సిటిజన్ షిప్ వదులుకున్నారా, అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. 

జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని చెన్నమనేని రమేష్ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు కేంద్ర హోంశాఖ రద్దు చేసిన ఉత్తర్వులపై స్టే కొనసాగిస్తుందని, తదుపరి విచారణను హై కోర్ట్ ఈ నెల 24 కు వాయిదా వేసినట్లు తెలిపారు.  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News