cherlapally railway station work completed soon: హైదరాబాద్ లో మరో అద్భుతానికి కేంద్రంగా మారబోతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. చర్లపల్లి రైల్వే స్టేషన్.. హైదరాబాద్ నగరంలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా రూపొందనుంది. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయని..అతి తొందరలోనే ఇది ప్రారంభకానున్నట్లు తెలుస్తోంది.ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. ఎయిర్ పోర్టును మైమరపించేలా రైల్వే స్టేషన్ అద్భుతంగా నిర్మించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు
𝐄𝐧𝐡𝐚𝐧𝐜𝐢𝐧𝐠 𝐑𝐚𝐢𝐥 𝐈𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐢𝐧 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚: 𝐂𝐡𝐚𝐫𝐥𝐚𝐩𝐚𝐥𝐥𝐢 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧
𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐮𝐩𝐝𝐚𝐭𝐞 : 𝟗𝟖% 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞𝐝
The new satellite terminal, set to become the fourth largest railway station in Telangana,… pic.twitter.com/jnuTAe8zYq
— G Kishan Reddy (@kishanreddybjp) July 13, 2024
హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్ అతి తొందరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఈ మూడు రైల్వే స్టేషన్ ల గుండా వేలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తు ఉంటారు. ఈ నేపథ్యంలో.. నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణమవుతోంది. ఈరైల్వే స్టేషన్ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ స్టేషన్ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
అద్భుతమైన... అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ రెడీ అవుతుందనిన కేంద్ర మంత్రిర కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిపోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్ లోని నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్టేషన్ డిజైన్, నిర్మాణం..చూడటానికి ఎంతో అద్బుంగా ఉంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందే పూర్తి ఈ స్టేషన్ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ అనివార్యకారణాల వల్ల ఈ స్టేషన్ పనులు పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది.కానీ ప్రస్తుతం మాత్రం.. 98 శాతంపనులు పూర్తయినట్లు సమాచారం. రూ.434 కోట్ల బడ్జెట్‌తో ఈ స్టేషన్‌ను నిర్మించినట్టు తెలిపారు. ఇది తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ గా రూపుదిద్దుకొనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫాంలు ఉన్నాయని.. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో జనాల రద్దీ కాస్తంత తగ్గుతుందని భావిస్తున్నారు.
సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతో మందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట 6 ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు, ఆ తర్వాత 25 జతల దూరప్రాంత రైళ్లను నడపనున్నట్టు సమాచారం. రూ.430 కోట్లతో ఈ రైల్వేస్టేషన్‌ను నిర్మాణం చేపట్టగా.. ఇప్పటికే 24 రైల్వే బోగీలు పట్టే విధంగా 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి.
మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లను కూడా నిర్మించారు.అదే విధంగా..12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మించారు. 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా రైళ్లు ప్రయాణాలు నేరుగా సాగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kishan Reddy: హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్.. ఎయిర్ పోర్టును తలదన్నేలా నిర్మాణాలు.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి..
హైదరబాద్ నగరవాసులకు మరో గుడ్ న్యూస్..
ఆనందం వ్యక్తం చేస్తున్న రైల్వే ప్రయాణికులు..