మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి

మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి

Last Updated : Nov 3, 2018, 11:03 PM IST
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి

తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తమ ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవడానికి వీలుగా చెక్ యువర్ ఓట్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండే బూత్ స్థాయి అధికారుల సహాయంతో ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చని రజత్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు లేని అర్హులు, జాబితాలో పేరు లేని అర్హులు ఈ నెల 9వ తేదీ వరకు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా రజత్ కుమార్ స్పష్టంచేశారు. 

ఓటర్ల జాబితాపై పార్టీలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలపై అవగాహన పెంచాలని వివిధ పార్టీల నేతలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నాం అని చెబుతూ ఈవీఎం మెషిన్ల పనితీరుపై సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టు రజత్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరించారు.

Trending News