Telangana TDP: చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎఫెక్ట్.. కొత్త చీఫ్ తో తెలంగాణలో సైకిల్ చక్రం తిరిగేనా?

Telangana TDP: తెలంగాణలో పార్టీ బలహీనం అవుతున్నా పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు. 2024లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టారు. దసరా రోజున పార్టీని ప్రకటించిన కేసీఆర్.. త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 15, 2022, 03:56 PM IST
  • తెలంగాణపై టీడీపీ ఫోకస్
  • కాసాని జ్ఞానేశ్వర్ కు పగ్గాలు
  • బీఆర్ఎస్ పార్టీతో బాబు అలర్ట్
Telangana TDP: చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎఫెక్ట్.. కొత్త చీఫ్ తో తెలంగాణలో  సైకిల్ చక్రం తిరిగేనా?

Telangana TDP: తెలుగుదేశం పార్టీ గతంలో తెలంగాణలో బలంగా ఉండేది. ఏపీలో కంటే తెలంగాణలో టీడీపీ ఓట్ల శాతం ఎక్కువగా ఉండేది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకీ తెలంగాణలో గడ్డు పరిస్థితులు ఎగురయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీడీపీకి సమస్యలు ఎదురయ్యాయి. సమైక్యాంధ్ర ముద్రతో తెలంగాణ టీడీపీ నేతలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా.. ఆయనపై, టీడీపీపై సమైక్యాంధ్ర ముద్ర పోలేదు. 2014లో ఏపీ ముఖ్యమంత్రి అయ్యాకా తెలంగాణలో పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయలేదు చంద్రబాబు. దీంతో 2014లో 15 అసెంబ్లీ సీట్లు గెలిచిన టీడీపీ.. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా రెండు సీట్లు మాత్రమే గెలిచింది. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తర్వాత కారెక్కారు.

తెలంగాణలో పార్టీ బలహీనం అవుతున్నా పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు. 2024లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టారు. దసరా రోజున పార్టీని ప్రకటించిన కేసీఆర్.. త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి.. ఏపీ, తెలంగాణకు కమిటీలు వేశారు. అయినా తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడంతో అప్రమత్తమైన చంద్రబాబు.. తాను ఏమాత్రం వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు.

తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించారు చంద్రబాబు. ఇప్పటివరకు టీటీడీపీ చీఫ్ గా బక్కని నర్సింహులు ఉండగా.. అతని స్థానంలో కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ ను నియమించారు. శుక్రవారం సాయంత్రమే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కాసాని. వెంటనే ఆయన్ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా అపాయింట్ చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్. తెలంగాణలో  ముదిరాజు సామాజిక వర్గం బలంగా ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాసాని. గతంలో ఆయన ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. కాసాని చేరికతో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందన్నారు చంద్రబాబు. త్వరలోనే తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. తెలంగాణలో టీడీపీకి నేతలు దూరమైనా కేడ్ బలంగానే ఉంది. బలమైన నేతలు వస్తే కేడర్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. అందుకే కాసాని ద్వారా పార్టీ బలోపేతం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారని తెలుస్తోంది.

గతంలో జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన టీడీపీ.. ఇప్పుడు ఒక్క ఏపీలో మాత్రం సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడింది. కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీతో ఏపీలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏపీ నేతలు కొందరు బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు ఏపీలో పార్టీని విస్తరిస్తే.. గతంలో అధికారం నిర్వహించిన తెలంగాణలో తమ పార్టీ వీక్ కావడం సరికాదనే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు. అందుకే చంద్రబాబు బలమైన నేత కాసానికి తెలంగాణ పార్టీ పగ్గాలు ఇచ్చారని భావిస్తున్నారు.

Read also: Boora Narsaiah Goud: బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ బంపరాఫర్! వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేది అక్కడే?

Read also: రకుల్ కవ్వించే పోజులు.. ఆ పార్ట్ చూపిస్తోన్న కూల్ బ్యూటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News