కేటీఆర్‌కు బిజినెస్ లీడర్ అవార్డు

బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఆ సంస్థ తరఫున అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అందుకున్నారు. 

Last Updated : Dec 21, 2017, 08:37 PM IST
కేటీఆర్‌కు బిజినెస్ లీడర్ అవార్డు

బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఆ సంస్థ తరఫున అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అందుకున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్న కేటీఆర్ మాట్లాడుతూ " పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తుంది.

భారతదేశంలో సాగుకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణం" అని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో విశేష ప్రతిభ కనబరిచే సంస్థలకు, నగరాలకు, వ్యక్తులకు బిజినెస్ వరల్డ్ సంస్థ ఇటీవలే అవార్డులను ప్రకటించింది. అందులో తెలంగాణకు రెండు అవార్డులు రావడం గమనార్హం. అందులో ఒకటి కేటీఆర్‌కు లభించగా, మరొకటి తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖకు దక్కింది.

Trending News