బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు: బి వినోద్ కుమార్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 పై తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..

Last Updated : Feb 1, 2020, 10:34 PM IST
బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు: బి వినోద్ కుమార్

హైదరాబాద్ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 పై తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఇది నిర్లిప్తమైన బడ్జెట్ అని, దీనిలో కొత్తదనం ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండో సారి అధికారం చేపట్టినా భారతీయ జనతా పార్టీ ఒక్కటైనా ఫ్లాగ్ షిప్ పథకం కూడా లేకపోవడం బాధాకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఆయా శాఖలకు పద్దుల కేటాయింపులో కొత్త ఆలోచనలు ఏమీ లేవని, ఎప్పటిలాగే కేటాయింపులు చేశారని అన్నారు.యంగ్ ఇండియా చిత్రీకరిస్తు.. యువ తరానికి ఒక్క పథకం కూడా ప్రకటించలేదని ఆయన విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం బడ్జెట్ లో నిధులు పెంచలేదని ఆయన అన్నారు.విద్యా, ఆరోగ్యం తమ ప్రధాన ప్రాధాన్యతలేని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు చేయలేదని ఆయన  అసంతృప్తి వ్యక్తం చేశారు. నేటి  కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వినోద్ కుమార్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News