KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించాలని పిలుపు

KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 03:12 PM IST
KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించాలని పిలుపు

BRS Party Meet: సార్వత్రిక ఎన్నికలకు గులాబీ దళం భారీ వ్యూహం రచిస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన ఆ పార్టీ ఇప్పుడు హైదరాబాద్‌పై దృష్టి సారించింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌ పార్టీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరై తిరుగుప్రయాణంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆటోలో వెళ్లారు. యూసుఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్‌ వరకు ఆటోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆటోలో వెళ్లారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అనంతరం జరిగిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధంపై విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో ప్రజల ఇంటికి వచ్చి అధికారులు వివరాలు సేకరించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్‌ పాలనలో మాత్రం ప్రజలను రోడ్డుపైకి తీసుకొచ్చి క్యూలు కట్టేలా చేసిందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసమే ఇచ్చిన హామీలు అమలుచేస్తామని అబద్ధపు మాటలు ఆడుతున్నారని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోసం చేయడం కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమీ కాదని కేటీఆర్‌ తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితేనే ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పారు. అందుకే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని పునరుద్ఘాటించారు. ఇక సికింద్రాబాద్‌ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా ఉండి ఎందుకు దండగ అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్‌రెడ్డిని జాలిపడి ఎంపీగా గెలిపించారని చెప్పారు. 

బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలిపారు. రెండూ కలిసి తెలంగాణలో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీది ఫెవికాల్‌ బంధమని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేమీ లేదని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సరైన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

Also Read: Social Media Hazard: సోషల్‌ మీడియా అనేది విష పదార్థం.. తుపాకీ కన్నా ప్రమాదకరం

Also Read Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News