We Will Come Again In Power: తెలంగాణ రాష్ట్రం కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేశాడని.. కానీ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టినోడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం దౌర్భగ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నాడు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని స్పష్టం చేశారు. చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం అయ్యాడని వివరించారు. ఉద్యమ కారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన వ్యక్తి సీఎం అయ్యాడని గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తోందని తెలిపారు.
Also Read: School Holidays: తెలంగాణలో నాలుగు రోజులు స్కూల్స్, ఆఫీసులు బంద్.. ఎందుకంటే..?
బీఆర్‌ఎస్ పార్టీ కృతజ్ఞత సభల్లో భాగంగా మంగళవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటు వేశారు. గెలుపు ఓటములు ఉంటాయి. అధికారం, ప్రతిపక్షం అయినా మనం ప్రజల పక్షం ఉందాం' అని పార్టీ శ్రేణులకు చెప్పారు. కాంగ్రెస్ వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు.
Also Read: Telangana Investment: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు
కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి గంటలో ఉంటామని హరీశ్ రావు ప్రకటించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చామని గుర్తుచేశారు. ఏనాడు జై తెలంగాణ అని వారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్లీ స్పీడ్ అందుకుంటామని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే కేసీఆర్ నల్లగొండలో గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేశారని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శిస్తూ.. 'ఆరు గ్యారంటీల్లో 13 గ్యారెంటీలు ఉన్నాయి. రెండు అయిపోయాయని ప్రచారం చేసుకుంటున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.2,500 ఇవ్వడం లేదు. బడ్జెట్‌లో నిధులు పెట్టలేదు. గ్యారెంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చారు. కానీ మోసం చేస్తున్నది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల పేరిట మోసం చేశారు' అని విమర్శించారు. ప్రమాణ స్వీకారం మాత్రం త్వరగా చేశాడు కానీ హామీల అమలు మాత్రం తొందర చేయడం లేదన్నారు.
కరోనా సమయంలో కూడా మేము రైతు బంధు ఇచ్చాం.. కానీ ఇప్పుడు ఏ సమస్యా లేకున్నా ఎందుకు రైతు బంధు ఇవ్వడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతులకు పంట బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హామీల గురించి అడిగితే అసెంబ్లీలో తప్పుడు శ్వేత పత్రాలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారని తెలిపారు. వాస్తవాలు బయట పెడితే తిట్టడం ప్రారంభించారని మండిపడ్డారు. అబద్ధాలు తప్ప నిబద్దత లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పాలకులు 1984 నుంచి 2014 దాకా ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వలేదని వెల్లడించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 6.36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పనులు పూర్తయ్యాయని, కాలువలు తవ్వితే నీళ్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఆ పని పూర్తి చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ పాలమూరును మోసం చేశాయని విమర్శించారు. జాతీయ ప్రాజెక్ట్ తీసుకురావడంలో రెండూ పార్టీలు విఫలమయ్యామని మండిపడ్డారు.
ఆర్టీసీ ఉచిత బస్సుపై హరీశ్ రావు స్పందిస్తూ.. '21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. నెలకు రూ.10 వేలు వారికి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. వ్యంగం బంద్ చేసి, బూతులు బంద్ చేసి రైతుల మీద ప్రేమ చూపాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారు. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్‌ఎస్ గెలవాలని పిలుపునిచ్చారు. 'భవిష్యత్తు మనదే. ఇది నిజం తథ్యం. కార్యకర్తలు కష్టపడాలి' అని దిశానిర్దేశం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook