BRS Party MLAs: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. టచ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు

BRS Party MLAs Touch: తెలంగాణలో జాతీయ పార్టీలు బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునేందుకు రెండు పార్టీలు చూస్తున్నాయి. తాజాగా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 09:23 PM IST
BRS Party MLAs: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. టచ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు

Bandi Sanjay Sensatonal Comments: బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 5 మంది సిట్టింగ్ లు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించి కలకలం రేపారు. ఈసారి రాష్ట్రంలో అన్నీ ఎంపీ స్థానాలు కొల్లగొడుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇదంతా కేసిఆర్ ఆడుతున్న నాటకమని తెలిపారు. సాక్ష్యాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై విమర్శలు చేశారు. అటువంటి వారితో బీజేపీ పొత్తు ఉండదు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోలేదు. తెలంగాణలో మేము 17కి 17సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ప్రకటించారు.

Also Read: KCR Birth Day: ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ కూడా గెలిచే అవకాశం లేదని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారని తెలిపారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమాలుతున్నాడని వివరించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్నా కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఇదేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైల్ లో ఉండేవాళ్లని చెప్పారు. గ్రౌండ్ లెవెల్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఏ పార్టీ నేతలే చెప్పాలని సవాల్ విసిరారు.

Also Read: Telangana: చేతకాదని రేవంత్‌ వైదొలిగితే ముఖ్యమంత్రిగా నేనేంటో చూపిస్తా: హరీశ్ రావు సవాల్‌

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒక్కవైపు, రజాకార్లు, ఎంఐఎం బీఆర్ఎస్ ఒక వైపు ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీ కి ఓటేస్తారని చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీని ప్రజలే బహిష్కరిస్తారన్నారు. 'ఏ ప్రభుత్వం అయిన ఐదు ఏళ్లు ఉండాలని కోరుకుంటాం. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్ కి బుద్ది చెప్తారు. అప్పుడెందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతున్నారు?' అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే .. ఆ పార్టీ నుంచే షిండేలు బయటకు వస్తారని తెలిపారు. బీజేపీ సిద్దాంతాలు నమ్మి.. మోడీ నాయకత్వంలో పని చేసేందుకు ఇంటరెస్ట్ ఉన్న ఎవరినైనా పార్టీలో చేరవచ్చని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు బండి సంజయ్‌ ఓ సవాల్ విసిరారు. 'కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు బయటకు వస్తే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటాం' అని ప్రకటించారు. కేసీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ ఖతం అయ్యిందని పేర్కొన్నారు. '20 నుంచి బస్సు యాత్ర మొదలు కానుంది. 25 నుంచి రెండవ ప్రజా హిత యాత్ర ఉంటుంది' అని వివరాలు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News