BRS MLA Harish rao hot comments on komatireddy venkatreddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం మీద మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహరంలో ఎమ్మెల్యే హరిష్ రావు దొంగ చాటున అమెరికా వెళ్లి గత సీఎండీ ప్రభాకర్ రావుతో భేటీ అయ్యారని అన్నారు. మే26 న హరీష్ రావును, రహస్యంగా కేసీఆర్ మంతనాలు జరపడానికి అమెరికాకు పంపించాడని ఎద్దెవా చేశారు. అమెరికా వెళ్లి సీఎండీ ప్రభాకర్ ని కలవలేదని హరీష్ చెప్పగలరా.. అంటూ సవాల్ విసిరారు.
Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
ఫోన్ ట్యాపింగ్ విషయంలో అందరి పేర్లు బైటకు వస్తాయని, దీని వెనుక ఎవరున్న వదిలే ప్రసక్తి లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రావు ఎక్కడ ఇండియా వస్తే.. తమ బండారం బైటపడుతుందని కేసీఆర్ ఆందోళనకు గురౌతున్నాడని అన్నారు. ఒకవేళ సీఎండీ అప్రూవర్ గా మారితే.. కేసీఆర్ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ కోట్లాది రూపాయలు వసూలు చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా.. పై ఆరోపణలపై ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
హరీష్ రావు ఎక్స్ వేదికగా.. కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదంటూ సెటైర్ లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవమన్నారు. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు.. తాను.. అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం... ఒక వేళ రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయాలంటూ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. తాను ఏ దేశం వెళ్లింది, ఏ హోటల్‌లో ఉన్నాననే తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస ఈ జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి గారు మాట్లాడటం చౌకబారుతనానికి నిదర్శనమని హరీష్ రావు అన్నారు. కోమటిరెడ్డి గారి తనపై చేసిన ఆరోపణలపై.. ఏదైన ఆధారాలు ఉంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వేళ సరైన, ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకానీ.. టీవీల్లో బ్రేకింగ్ లు, స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని చురకలంటించారు.
Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..
నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు, చిల్లర ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి గారు తన హుందాతనాన్ని నిలుపుకోవాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ భగవంతుడు మీకు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నానట్లు ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే హరిష్ రావు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..
మంత్రి కోమటి రెడ్డికి మతి భ్రమించింది..
మరోసారి ఫైర్ అయిన ఎమ్మెల్యే హరీష్ రావు..