Boy raped minor girl in hyderabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినచట్టాలు తీసుకొచ్చిన మహిళలు, అమ్మాయిలపై దాడులు మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు యువతులు వేధింపులకు గురైన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్ లు, మెట్రోలు, పనిప్రదేశాలలో మహిళలు వేధింపులకు, అత్యాచారాలకు గురౌతునే ఉన్నారు. కొందరు అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి మంచిగా ఉంటున్నారు. కొంత కాలంలో తర్వాత తమ అసలు బుద్దిని చూపిస్తున్నారు. వారితో చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు మార్ఫింగ్ చేసుకొవడం, వీడియోలు వంటివి తీసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిల భద్రత పెనుసవాల్ గా మారింది. బైట కాదు కదా.. ఇంట్లోనే వేధింపులకు గురౌతున్నారు కంటికి రెప్పలాగా చూసుకొవాల్సిన వారే వేధింపులకు గురిచేస్తున్నారు.
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
ఇంట్లో అన్న, తండ్రి, బంధువులు సైతం అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు కొకొల్లలు. కొందరు యువత ప్రవర్తన ఈ మధ్య కాలంంలో చాలా విచిత్రంగా మారింది. ఫోన్ లను అతిగా వాడటం, స్కూల్ డేస్ లోనే ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇవి తప్పని నిలదీస్తున్న తల్లిదండ్రుల మాట కూడా వినడం లేదు. కాదూ, కూడదంటూ చెప్తే ఇంట్లో గొడవలు పడి బైటకు వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలానే ఇంటి నుంచి బైటకు వెళ్లి లేని ప్రమాదాన్ని ఒక బాలిక కొనితెచ్చుకుంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మైనన్ బాలికపై సందీప్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. సికింద్రాబాద్ కు చెందిన సదరు మైనర్ బాలిక ఇంట్లో అతిగా ఫోన్ లను వాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో గొడవలు పడి బైటకు వచ్చేసింది. రోడ్డుపైన ఏడ్చుకుంటూ వెళ్లింది. ఈమెను సందీప్ అనే యువకుడు గమనించాడు. దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పాడు. అంతేకాకుండా.. కోపం తగ్గేవరకు షెల్టర్ ఇస్తానంటూ కూడా ఆమెకు నమ్మకం కలిగేలా మాటలు కలిపాడు. అతగాడి మనస్సులోని దురుద్దేశాన్ని బాలిక గుర్తించలేకపోయింది. అతగాడితో బైక్ ఎక్కి, కాచీగుడలోని లాడ్జీకి వెళ్లింది. అక్కడ అతను బాలికను లోంగదీసుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, పారిపోయాడు.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
ఈ క్రమంలో బాలిక తేరుకుని లాడ్జీ సిబ్బందితో కలిసి తన తల్లిదండ్రులకు ఘటనపై ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బైటకు వచ్చి రిస్క్ లో పడిందంటూ కుటుంబ సభ్యును ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్లారిటీ ఇచ్చిన ర్యాపీడో సంస్థ..
ఇటీవల హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచార ఘటనను ర్యాపీడో డ్రైవర్ చేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ర్యాపీడో సంస్థ క్లారిటీ ఇచ్చింది. హైదరబాద్ లో జరిగిన ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయినట్లు సంస్థ తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో తమ సంస్థ బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపింది. కొందరు తమ సంస్థకు చెందిన డ్రైవర్ ఇలా చేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.. కానీ సదరు యువతి ఎలాంటి ర్యాపీడో బుక్ చేయలేదని, ఘటన జరిగినప్పుడు ఎలాంటి ర్యాపీడో రైడ్ కూడా జరగలేదని సంస్థ స్పష్టం చేసింది.
Rapidoలో, మా కస్టమర్‌ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. Rapido ఏ విధమైన దుష్ప్రవర్తనకైనా జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని తెలిపారు. మా కస్టమర్‌ల భద్రతను నిర్ధారించడానికి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రాపిడో కెప్టెన్‌లందరికి కఠినమైన నేపథ్య ధృవీకరణను చేస్తామని సంస్థ తెలిపింది. ఈ ఘటనలో తమ సంస్థకు చెందిన డ్రైవర్ పై ఉన్నాడనడం పూర్తిగా అవాస్తవమని సంస్థ క్లారిటీ ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter