Black Magic In Villages: ఊరిబయట మామిడితోటలో క్షుద్రపూజలు.. గ్రామంలో టెన్షన్ టెన్షన్

Black Magic In Villages: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారు మామిడితోటలో క్షుద్రపూజలు కలకలం‌ రేపింది. 10 అడుగుల మనిషి ఆకారంలో పసుపు, కుంకుమ, సున్నం, బొగ్గు పొడితో బోమ్మ గిసి క్షుద్రపూజల చేసిన ఆనవాళ్ళు కనిపించాయి.

Written by - Pavan | Last Updated : Jul 10, 2023, 12:48 PM IST
Black Magic In Villages: ఊరిబయట మామిడితోటలో క్షుద్రపూజలు.. గ్రామంలో టెన్షన్ టెన్షన్

Black Magic In Villages: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారు మామిడితోటలో క్షుద్రపూజలు కలకలం‌ రేపింది. 10 అడుగుల మనిషి ఆకారంలో పసుపు, కుంకుమ, సున్నం, బొగ్గు పొడితో బోమ్మ గిసి క్షుద్రపూజల చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. మనిషి ఆకారంలో గీసిన బొమ్మ వద్ద  ఓ మనిషికి సంబందించిన ఫ్యాంట్, షర్ట్, బనియన్‌తో పాటు ఎముకలు, రెండు నళ్ళ కోళ్ళను చంపి అక్కడ పడి వేశారు. కోడి గుడ్లు, గుమ్మడికాయ పగలకొట్టి క్షుద్రపూజలు చేసిన అనవాళ్లు ఉన్నాయి. 

ఆదివారం ఉదయం అటువైపు పశువులు మేపుకునేందుకు వెళ్లిన పశువుల కాపారులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించడంతో ఈ క్షుద్రపూజల వైనం వెలుగుచూసింది. తమ గ్రామ శివార్లలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్త ఆ ఊరిలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దావానంలా వ్యాపించింది. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా, సినిమాల్లో చూసిన తరహాలో క్షుద్రపూజలు జరిగిన తీరు చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

మరీ ముఖ్యంగా మనిషి బొమ్మ గీసిన చోట ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి చెందిన ప్యాంట్, షర్ట్, బనియన్ వంటి దుస్తులు లభించడంతో అవి ఎవరివి అయితే, ఈ క్షుద్రపూజల బాధితులు కూడా వారే అవుతారని.. ఇంతకీ ఆ దుస్తులు ఎవరివి అయ్యుంటాయి అని జనం ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. ఈ విధంగా మనిషి బొమ్మగిసి బట్టలతో క్షుద్రపూజలు ఎప్పుడూ చూడలేదని, అది కూడా ఊరు బయటి మామిడి తోట లాంటి నిర్జన ప్రదేశంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేశారంటే కచ్చితంగా నగ్నంగానే కుద్రపూజలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇదంతా ఆ మామిడి తోట యజమానికి తెలిసి జరిగిందా లేక తెలియకుండా జరిగిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ మామిడి తోట యజమానికి తెలిసే ఈ క్షుద్రపూజలు జరిగి ఉంటే, వీటి వెనుక తోట యజమాని ప్రమేయం ఏమైనా ఉందా అని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Anaconda Snake Chasing Boy : బాలుడి వెంటపడిన భారీ సైజ్ ఆనకొండ పాము.. ఈ వైరల్ వీడియో నిజమేనా ?

ఇదిలావుంటే, మరొకవైపు ఇది తోట యజమానికి తెలియకుండా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అనే వాళ్లు కూడా ఉన్నారు. కేవలం ఊరి బయట నిర్జన ప్రదేశం కోసం వెతికే క్రమంలోనే క్షుద్రపూజలు చేసిన వాళ్లు ఆ స్థలాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చు అనేది వారి అభిప్రాయం. ఏదేమైనా మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న సామెత చందంగా.. క్షుద్రపూజలు అనేవి ఉత్తి మూఢ నమ్మకం మాత్రమే కానీ అందులో నిజం ఉండదు అనే విషయం జనం మర్చిపోకూడదు. చేతబడి, క్షుద్రపూజలు లాంటి మూడ నమ్మకాలను నమ్మొద్దు అని ఓవైపు జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు జోరుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాటిపై గురిపోకపోవడం బాధాకరం.

ఇది కూడా చదవండి : Man Died of Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో రైల్వే గేటు వద్ద చిక్కుకుపోయిన అంబులెన్స్ !!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x