Bypoll Strategy: తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహం, త్వరలో మరో ఉపఎన్నిక

Bypoll Strategy: తెలంగాణలో మరో ఉపఎన్నికకు సూచనలు కన్పిస్తున్నాయి. జరుగుతున్న ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలాన్ని పెంచుతుండటంతో..అదే వ్యూహం అవలంభించేందుకు సిద్ధమౌతోంది ఆ పార్టీ.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2022, 10:16 PM IST
Bypoll Strategy: తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహం, త్వరలో మరో ఉపఎన్నిక

మునుగోడు ఎన్నికల అనంతరం బీజేపీ కొత్త వ్యూహం రచిస్తోంది. ఉపఎన్నికలో పరాజయం పొందినా..పార్టీలో ఉత్సాహం పెరిగింది. కారణం ఆ పార్టీకు పెరుగుతున్న ఓట్ల శాతమే. ఈ పరిణామం మరో ఉపఎన్నికకు దారి తీయనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ పరాజయం తెలిసిందే. నువ్వా నేనా రీతిలో సాగిన పోటీలో ప్రతి రౌండ్‌లో బీజేపీ..అధికార పార్టీకు గట్టి పోటీ ఇచ్చింది. ఫలితంగా నియోజకవర్గంలో గణనీయంగా ఓట్ల శాతం పెంచుకుంది.  2018 నుంచి ఇప్పటి వరకూ బీజేపీ రాష్ట్రంలో బలాన్ని పెంచుకుంటోందనేది స్పష్టంగా అర్ధమౌతోంది. పార్టీ బలం ఒక అసెంబ్లీ స్థానం నుంచి 3 స్థానాలకు పెరిగింది. అటు లోక్‌సభ స్థానాలు 4 ఉన్నాయి.

2018లో 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం గోషామహల్ తప్ప అన్నిచోట్లా ఓడిపోయింది. కానీ ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ స్థానాల్ని గెల్చుకుంది. ఇటు దుబ్బాక, హుజూర్ నగర్ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. మునుగోడులో ఓడినా..గట్టి పోటీ ఇచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లను గణనీయంగా పెంచుకుంది. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. 

ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే..ఉపఎన్నికలు బీజేపీకు బాగా కలిసొస్తున్నాయని చెప్పవచ్చు. ప్రతి ఉపఎన్నికకూ..పెరుగుతున్న సీట్లు, ఓట్లు రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారానికి పునాది వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. బలం అభ్యర్ధిదా..పార్టీదా అనే విషయం పక్కనబెడితే..రాజకీయంగా లబ్ది పొందుతున్నది మాత్రం బీజేపీనే. అందుకే ఇప్పుడు బీజేపీ మరో ఉపఎన్నికకు ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.

ఉపఎన్నిక ఎక్కడ

సికింద్రాద్ ఎంపీ స్థానం బీజేపీదే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే సికింద్రాబాద్ పరిధిలోని ఓ నియోజకవర్గం ఎమ్మెల్యేను రాజీనామా చేయించి..ఉపఎన్నిక నిర్వహించాలనేది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం సులభమేనని తెలుస్తోంది. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం త్వరలో ఖాళీ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యే పార్టీ మారే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మునుగోడు ఫలితం మరోలా వచ్చి ఉంటే..ఈపాటికే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసుండేవారని తెలుస్తోంది. ఫలితం అధికార పార్టీకు అనుకూలం కావడంతో ఆ ఎమ్మెల్యే కాస్త మీమాంసలో పడినట్టు సమాచారం.

Also read: Ippatam Issue: ఇప్పటం గ్రామంలో మరో వివాదం, కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News