కేసీఆర్‌కు సంజయ్ లేఖ

'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు బీజేపీ మద్దతు ఇస్తుందని  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు లేఖ  రాశారు.  కరోనా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరారు.

Last Updated : Mar 24, 2020, 03:37 PM IST
కేసీఆర్‌కు సంజయ్ లేఖ

'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు బీజేపీ మద్దతు ఇస్తుందని  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు లేఖ  రాశారు.  కరోనా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరారు. నిత్యావసర  వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సంజయ్ లేఖలో  పేర్కొన్నారు. దళారులపై చర్యలు చేపట్టాలని కోరారు. 

మా ఊరికి రావద్దు..!! 

కేంద్ర ప్రభుత్వం 'కరోనా వైరస్'ను ఆయుష్మాన్ భారత్‌లో చేర్చిందని సీఎం కేసీఆర్‌కు సంజయ్ గుర్తు చేశారు. కాబట్టి తెలంగాణలో తక్షణమే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని కోరారు. తెలంగాణలో క్రమక్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై ఎంపీ బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరింత జోరు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వారికి ప్రత్యేక ఐసోలేషన్‌లో అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించాలని కోరారు. ఇందుకోసం వైద్య సిబ్బంది సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీలో 'కరోనా' కొత్త కేసుల్లేవ్..!!

మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య పెరిగినట్లయితే .. పాత సెక్రటేరియట్ ను ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాత సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News