MLA Rajasingh: అయోధ్యలో మసీదు నిర్మించాలి

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపుతుండే ఆ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముస్లింలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. అయోధ్యలో మసీదు నిర్మించాలని ఆయన ట్వీట్ కూడా చేెయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

Last Updated : Aug 9, 2020, 01:16 PM IST
MLA Rajasingh: అయోధ్యలో మసీదు నిర్మించాలి

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపుతుండే ఆ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముస్లింలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. అయోధ్యలో మసీదు నిర్మించాలని ఆయన ట్వీట్ కూడా చేెయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

తెలంగాణ బీజేపీలో యాక్టివ్ ఎమ్మెల్యేగా  రాజాసింహ్ పేరు చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఉన్న ఏకైన బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆయినే. ఆయన చేసే వ్యాఖ్యల్లో అధికంగా ముస్లింలకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నా...అతని తమ్ముడు అక్బరుద్దీన్ పై ఎప్పుడూ మండిపడుతూ ఉండే రాజాసింహ్ ఈసారి కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా అయోధ్యలో మసీదు నిర్మించాలని ఆయన డిమాండ్ చేయడమే కాకుండా..ఈ మేరకు ట్వీట్ చేయడం సంచలనమవుతోంది. 

రామ జన్మభూమి అయోధ్యలో మసీదు నిర్మించడమే కాకుండా… ఆ మసీదుకు దేశాన్ని న్యూక్లియర్ శక్తిగా మార్చిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని రాజాసింగ్ కోరారు. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ అయితే..అయోధ్యలో నిర్మించే మసీదుకు బాబ్రీ పేరుపెట్టాలని చెప్పడంపై రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  Also read: Bloomberg Billionaires Index: ముకేశ్ ఇప్పుడు నాలుగో స్థానంలో

Trending News