Raghunandan Rao Comments: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి ఫోటోలను మీడియాకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చూపించారు. ఇప్పుడు అది వివాదస్పదమవుతోంది. ఆయనపై పోలీసులు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు.
తాను అమ్మాయి పేరు చెప్పలేదని..ముఖం కూడా చూపించలేదని..ఎంఐఎం నాయకులను తప్పించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాను ఫోటోలను విడుదల చేయక ముందే మీడియా, సోషల్ మీడియాలో వచ్చాయని గుర్తు చేశారు. అసలు దోషులను తప్పించేందుకు ఇలా చేస్తున్నారని రఘునందన్‌రావు ఫైర్ అయ్యారు. కేసులు ఎదుర్కోవడం తనకు కొత్తమేకాదని స్పష్టం చేశారు. పోలీసు అధికారి జోయల్ డెవిస్‌కు ఆ విషయం తెలుసని అన్నారు.
తన తప్పు ఉంటే కేసు పెట్టి..చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపై అధికార పార్టీ నేతలు మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనన్నారు రఘునందన్‌రావు. టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. న్యాయ వాద వృత్తిలో ఉన్న సమయంలో తనకు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లో క్లయింట్లు ఉండేవారని తెలిపారు.
తాను బీజేపీలో చేరాక ఏ కేసులను వాదించడం లేదని తేల్చి చెప్పారు. పాత బొమ్మలు చూపించి ఏదో అనుకుంటున్నారని విమర్శించారు. గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలిని న్యాయం జరిగేందుకు ప్రయత్నించాలన్నారు. ఈకేసులో హోంమంత్రి మనవడు పాత్ర ఏంటో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.
Also read: Kapil Dev Comments: టీమిండియా కీలక ఆటగాళ్లకు కపిల్ దేవ్ స్వీట్ వార్నింగ్..!
Also read:Indian Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ..ఈసారి ఎవరో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Raghunandan Rao: గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను తప్పించే కుట్ర..తానేవరికీ భయపడను: రఘునందన్‌రావు
గ్యాంగ్ రేప్ ఘటనపై రాజకీయ దుమారం
అధికార,విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు
తాజాగా రఘునందన్‌రావు నిప్పులు