DK Aruna on Harish Rao: అగ్నిపథ్‌పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార,విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీష్‌రావు ఆక్షేపించారు. అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయని ఫైర్ అయ్యారు.
మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. అమాయకులను రెచ్చగొట్టి ప్రాణాలతో చెలగాటం ఆడటం టీఆర్‌ఎస్, హరీష్‌రావులకు అలవాటు అని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సికింద్రాబాద్‌లో అల్లర్లు చెలరేగాయని విమర్శించారు. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు ఇలా చేశారని ఆరోపించారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు తెలంగాణలో కుట్రలు పన్నారని ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్‌లో పది గంటలపాటు విధ్వంసం జరుగుతుంటే..ప్రభుత్వం ఏం చేస్తోందని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాకేష్ అనే యువకుడు చనిపోయారన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందన్నారు. సికింద్రాబాద్ ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.
Also read: Agnipath Effect: దేశంలో అగ్నిపథ్ ఎఫెక్ట్..పలు రైళ్ల రాకపోకలు రద్దు..ఆ వివరాలు ఇవిగో..!
Also read: Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పురోగతి..పలువురు నిరసనకారుల అరెస్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook