GHMC office: 32 మంది కార్పొరేట‌ర్ల‌పై కేసులు న‌మోదు

GHMC office : జీహెచ్ఎంసీ కార్యాల‌యం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదుతో దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీలించారు పోలీసులు. తర్వాత కార్పొరేట‌ర్ల‌పై కేసులు న‌మోదు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 05:42 PM IST
  • జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డిన 32 మంది బీజేపీ కార్పొరేట‌ర్ల‌పై కేసు న‌మోదు
  • దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్
  • జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో శుద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టిన టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు
GHMC office: 32 మంది కార్పొరేట‌ర్ల‌పై కేసులు న‌మోదు

BJP corporators protest at GHMC office updates Cops filed case against 32 corporators: హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డిన 32 మంది బీజేపీ కార్పొరేట‌ర్ల‌పై (BJP corporators) సైఫాబాద్ పోలీసులు (Police) కేసు న‌మోదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాల‌యం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదుతో దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) ప‌రిశీలించారు పోలీసులు. తర్వాత కార్పొరేట‌ర్ల‌పై (corporators) కేసులు న‌మోదు చేశారు. నిన్న 10 మంది కార్పొరేట‌ర్ల‌పై కేసులు (Cases) న‌మోదు చేశారు. ఇక ఇవాళ మ‌రో 22 మందిపై కేసులు న‌మోదు చేశారు. 

ఇక అంతకు ముందు జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై (GHMC Office) బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ (TRS Party Working President), మంత్రి కేటీఆర్ (KTR) ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హైద‌రాబాద్ సీపీకి (Hyderabad CP) విజ్ఞ‌ప్తి చేశారు కేటీఆర్. బీజేపీ కార్పొరేట‌ర్లు రౌడీలు, గుండాల్లా వ్య‌వ‌హ‌రించార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read : చిరంజీవి, Nagababu, పవన్ కల్యాణ్‌లలో Niharika కు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా ?

ఇక బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న‌ను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు (TRS corporators) శుద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. జీహెచ్ఎంసీ ప‌రిస‌రాల‌తో పాటు లోగోను పాల‌తో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేట‌ర్ల ధ‌ర్నాను టీఆర్ఎస్ (TRS) కార్పొరేట‌ర్లు ఖండించారు. బీజేపీ కార్పొరేట‌ర్లపై (BJP corporators) చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మేయ‌ర్‌కు (Mayor) విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. దాడికి పాల్పడ్డ కార్పొరేట‌ర్ల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరారు.

Also Read : Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News