Rahul Sipligunj Attacked Video: రాహుల్ సిప్లింగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. వీడియో వైరల్

సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లింగంజ్ తలకు గాయాలయ్యాయి. పబ్‌లో ఓ యువతి విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

Last Updated : Mar 5, 2020, 10:17 AM IST
Rahul Sipligunj Attacked Video: రాహుల్ సిప్లింగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. వీడియో వైరల్

హైదరాబాద్: టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3 విజేత రాహుల్ సిప్లింగంజ్‌పై దాడి జరిగింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం రాహుల్‌పై దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ తన ఫ్రెండ్స్, ఓ యువతితో కలిసి బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్‌కు వెళ్లాడు. అదే పబ్‌కు వచ్చిన కొందరు యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.

Must Read: వ్యభిచారం చేయలేదు.. నన్ను వదిలేయండి: నటుడు ఆవేదన

వెంటనే స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ ఆ యువకులను అడ్డుకునే యత్నం చేశారు. ఇది పద్ధతికాదని వారిని వారించే యత్నం చేయగా.. మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ అండ్ బ్యాచ్, ఆ యువకుల గ్రూపు పబ్‌లోనే పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో రాహుల్‌పై ఓ యువకుడు బీరు సీసాతో దాడి చేయగా అతడు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 

కాగా, గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి తల గాయాలకు రాహుల్ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. అనంతరం అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులతో రాహుల్ గొడవకు దిగాడని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు దీనిపై సుమోటోగా కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు

Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News