By Election: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్‌ఎస్‌ పార్టీలో జోరు, కాంగ్రెస్‌లో బేజారు

Big Shock To Congress Party With High Court Orders: అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగలనుంది. త్వరలోనే తెలంగాణలో మరో ఎన్నికలు రానున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఊరట లభించే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 9, 2024, 04:15 PM IST
By Election: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్‌ఎస్‌ పార్టీలో జోరు, కాంగ్రెస్‌లో బేజారు

Telangana By Elections: వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొన్ని నెలలు కూడా కాలేదు. మరోసారి తెలంగాణలో ఎన్నికలు రానున్నాయా? అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ దెబ్బ తగలనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. బోటాబోటీ మెజార్టీతో అధికారంలోకి కాంగ్రెస్‌ తమ ప్రభుత్వం పడిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించింది. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటు
ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే తమ ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్‌పై తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు సంచలన ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మీరు చర్యలు తీసుకోకపోతే సుమోటోగా మేం చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించడంతో త్వరలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Also Read: Bandi Sanjay: ఎందుకీ హై‘డ్రామా’లాడులు..? హైడ్రాపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

పార్టీ మార్పు
శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఖైరతాబాద్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, భద్రాచలం ఎమ్మెల్యేలుగా దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు గెలిచారు. అయితే గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో కొన్ని రోజులకే వారు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పార్టీ మారడమే కాకుండా ఏకంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ పోటీ చేయడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ మారిన వ్యక్తికి ఎంపీ టికెట్‌ ఇవ్వడంపై ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. అయితే ఫిరాయింపులు అక్కడితో ఆగకుండా మరో ఏడు మంది చేరడంతో గులాబీ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. 

గులాబీ పార్టీ న్యాయ పోరాటం
పార్టీ ఫిరాయించిన దానం, కడియం, తెల్లంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్‌ నుంచి స్పందన సక్రమంగా లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌, కౌశిక్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సోమవారం స్పీకర్‌కు పై ఆదేశాలు ఇచ్చింది. అయితే గడువు కూడా ఇవ్వడంతో ఫిరాయింపుల అంశం సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. న్యాయస్థానం స్పందనతో స్పీకర్‌ కచ్చితంగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడమే మార్గంగా ఉంది. వారిపై చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానమే సుమోటోగా నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించడంతో ఇక ఆ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. 

గత్యంతరం లేని స్పీకర్
హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో స్పీకర్‌ విధిలేక వారిపై వేటు అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ వేటు వేయకపోతే న్యాయస్థానం నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉండడంతో స్పీకర్‌ వారిపై కచ్చితంగా వేటు వేస్తారని చర్చ జరుగుతోంది. వారిపై వేటు వేస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కొంత దెబ్బ తిన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఉప ఎన్నికల్లో మాత్రం తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురిపై వేటు వేస్తే పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలు కూడా తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. వారంతా బీఆర్‌ఎస్‌ పార్టీలో తిరిగి చేరే అవకాశం ఉంది. ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News