Govt Jobs: నిరుద్యోగులకు బిగ్ షాక్.. గ్రూప్ 4 పోస్టుల‌కు గండి!

Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.  

Written by - Srisailam | Last Updated : Aug 2, 2022, 11:23 AM IST
  • నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ షాక్
  • గ్రూప్ 4 పోస్టుల్లో వీఆర్వోల సర్దుబాటు
  • గ్రూప్4లో తగ్గనున్న 5 వేల పోస్టులు
Govt Jobs: నిరుద్యోగులకు బిగ్ షాక్.. గ్రూప్ 4 పోస్టుల‌కు గండి!

Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.

తెలంగాణలో గత ఐదేళ్లుగా ఉద్యోగ నియామకాలు ఆశించినంతగా జరగలేదు. పోలీస్ శాఖలో తప్ప మిగితా విభాగాల్లో కొత్తగా భర్తీ చేసిన పోస్టులు వందల్లోనే ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంపై కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర కోపంగా ఉన్నారు. తెలంగాణలో వివిధ సంస్థలు జరిపిన సర్వేల్లోనూ ఇదే స్పష్టమైంది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగింది కేసీఆర్ సర్కార్. ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేసే పనిలో పడింది. వివిధ శాఖల్లో గుర్తించిన 80 వేలకు పైగా ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో నిరుద్యోగులంతా ప్రిపరేషన్ లో పడ్డారు.

సీఎం కేసీఆర్ చెప్పినట్లే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రూప్-1, పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కోసం మాత్ర‌మే నోటిఫికేష‌న్లు వెలువ‌డ్డాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం టెట్ కూడా నిర్వహించింది. టెట్ ఫలితాలు రావడంతో త్వరలోనే టీఆర్టీ నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ఇక గ్రూప్ 4 పోస్టుల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 4 నియామక ప్రక్రియ త్వ‌ర‌లోనే ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. అయితే నిరుద్యోగుల ఆశ‌లపై నీళ్లు చల్లేలా తాజాగా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఐదు వేల మూడు వందల మందికిపైగా ఉన్న వీఆర్వోలు రోడ్డున పడ్డారు. ఉద్యోగం కోసం ఆందోళన చేస్తున్నారు. తాజాగా వీఆర్వోలకు సంబంధించి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-4 పోస్టుల్లో భాగ‌మైన వీఆర్వోల‌ను.. జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల్లో స‌ర్దుబాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. రెవెన్యూ శాఖ ప‌రిధిలో ఉన్న వీఆర్వోల‌ను ఆ శాఖ మిన‌హా మిగ‌తా శాఖ‌ల్లోని ఖాళీల్లోకి స‌ర్దుబాటు చేయాల‌ంటూ ప్ర‌భుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో 9 వేలకు పైగా గ్రూప్ 4 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీఆర్వోలను సర్దు బాటు చేస్తే ఇక మిగిలేది కేవలం 4 వేల పోస్టులే. ఇదే ఇప్పుడు నిరుద్యోగుల ఆగ్రహనికి కారణమైంది. ఐదు వేల మందికిపైగా ఉన్న వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేస తమకు మిగిలే పోస్టులు ఎన్ని అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల మొత్తానికి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీఆర్వోల సర్దుబాటు చేసేందుకు కొత్తగా పోస్టులు స్పష్టించాలని సూచిస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.

Also read:NTRs Daughter Uma Maheswari: ఎన్టీయార్‌ సంతానంలో చనిపోయిన వాళ్లు వీరే..

Also read: Venus Transit 2022: ఆగస్ట్ 7 నుంచి 23 రోజులపాటు ఈ రాశులపై డబ్బు వర్షం!

 
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News