హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్య భవన్‌లో రెండు రోజులు బస చేసేందుకు శనివారం దిగిన ఆయన ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. బలవన్మరణానికి పాల్పడే ముందు ప్రణయ్ భార్య అమృత తండ్రి సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. సూసైడ్ నోట్‌లో అమృత గురించి ఆయ ఏం రాశారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రణయ్ హత్యకేసు: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
తన తండ్రి మారుతీరావు ఆత్మహత్య ఘటనపై అమృత స్పందించింది. తండ్రి మరణంపై ఇప్పుడే ఏ విషయం చెప్పలేనంది. అయితే నాన్న ఆత్మహత్యపై నాకు ఏ స్పష్టత లేదు. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది. బహుశా తన తప్పు తెలుసుకున్నందుకే తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని అమృత అభిప్రాయపడ్డారు. అయితే మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని ఆమె చెప్పడం గమనార్హం.
Also Read: దక్షిణాదిన ఒకే‘ఒక్కడు’ మహేష్ బాబు
కాగా, ప్రణయ్ అనే యువకుడిని కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు మారుతీరావు. గర్భంతో ఉన్న భార్యను ఆసుపత్రికి టెస్టుల కోసం తీసుకెళ్లి వస్తుండగా మారుతీ రావు ఏర్పాటు చేసిన కిరాయి రౌడీ ప్రణయ్‌ను వేట కొడవలి లాంటి కత్తితో నరికి హత్య చేయడం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కలకలం రేపింది. ఈ కేసులో అమృత వెనక్కి తగ్గకపోవడంతో మారుతీరావు జైలుకెళ్లాడు. ఆరు నెలల కిందట బెయిల్‌పై విడుదలై కూతుర్ని బెదిరిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.