Temple Cleanliness: హైదరాబాద్‌లోని ఆలయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బండలు తుడిచారు. బకెట్లో నీళ్లు వేసుకుని బండలు తుడిచే కర్ర పట్టుకుని ఆలయమంతా శుభ్రం చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు గవర్నర్ ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని హనుమాన్ ఆలయాన్ని గవర్నర్ సందర్శించారు. ప్రతి శనివారం ఆమె ఈ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారు. స్వచ్ఛత అనంతరం గవర్నర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య ప్రాణప్రతిష్ట కోసం ఆమె ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయోధ్య ఆలయ తలుపులు హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని టిండర్ డిపో వారు తయారు చేయగా.. అక్కడికి గవర్నర్ వెళ్లారు. తలుపులను పరిశీలించి అక్కడ పూజలు చేసిన విషయం తెలిసిందే. 'హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ దేవాలయం లో స్వచ్ఛత అభియాన్ నిర్వహించాను. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేవాలయంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాము' అని గవర్నర్ తమిళిసై 'ఎక్స్'లో పోస్టు చేశారు. కాగా ప్రాణ ప్రతిష్ట ఉత్సవానికి తమిళిసై కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతం లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం లో స్వచ్ఛత అభియాన్ నిర్వహించాను.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భం గా గౌరవనీయులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేవాలయం లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వంచాము.#PranaPratishta… pic.twitter.com/UIeuv7KkAl
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 20, 2024
అస్సాంలో అమిత్ షా
అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని మోదీ ఓ పిలుపు ఇచ్చారు. ఆలయాలను పరిశుభ్రం చేయాలని.. ఇందులో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని సూచించారు. అందులో భాగంగానే గవర్నర్ ఆలయాన్ని శుభ్రం చేశారు. ఇక అస్సాంలోని తేజాపూర్ మహాభైరబ్ ఆలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. మొదట నీళ్లు చల్లి అనంతరం తుడిచారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో స్వయంగా శుభ్రం చేసి 'ఆలయ శుద్ధి' కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Also Read Buy to Bike with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
Also Read TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook