Amarnath Cloudburst:16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు... గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు

Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు.అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల నుంచి గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు

Written by - Srisailam | Last Updated : Jul 9, 2022, 12:19 PM IST
  • అమర్ నాథ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • గల్లంతైన వాళ్ల కోసం గాలిస్తున్న రెస్క్యూ టీమ్స్
  • వరదల నుంచి తప్పించుకున్న రాజాసింగ్
Amarnath Cloudburst:16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు... గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు

Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. రాత్రి కూడా సహాయచర్యలు కొనసాగాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, SDRF, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. అమర్నాథ్ గుహ దిగువన సంభవించిన ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆకస్మిక వరదల్లో 25 టెంట్లు కొట్టుకుపోయాయి. దాదాపు 40 మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలిస్తు్నారు. అమర్ నాథ్ లో ప్రస్తుతం భారీ వర్షాలు లేకపోయినా.. బాల్టాల్--హోలీ గుహ మార్గం వైపు మరో మేఘం కదులుతోంది. దీని ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ ప్రాంతంలో వరద రావొచ్చని, కొండచరియలు విరిగి పడిపోవచ్చని హెచ్చరించింది. దీంతో అధికారులు ఆ ప్రాంతం నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. 

అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల నుంచి గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు.  ఎమ్మెల్యే రాజా సింగ్ కుటుంబసభ్యులతో కలిసి అమర్ నాథ్ వెళ్లారు. భోలేనాథ్ దర్శనం అనంతరం తిరుగుపయనమయ్యారు. అంతలోనే భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. అప్పటికే రాజాసింగ్ టీమ్ సురక్షిత ప్రాంతంలో ఉంది. ఆకస్మిక వరదలతో టెంట్లు కొట్టుకుపోయిన భక్తులు వరదలో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని రాజాసింగ్ దాటిపోయిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. వరదలు వచ్చిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో రాజాసింగ్ ఉండగా ఈ ఘటన జరిగింది. వరదలకు సంబంధించిన వివరాలను రాజాసింగ్ ఫోన్ ద్వారా తెలుగు మీడియాకు అందించారు.  వరదలతో పలు టెంట్లు కొట్టుకుపోయాయని, 40 మంది వరకు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు.  

ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో వరద వచ్చిందన్నారు.  భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. మాకు కొంత దూరంలోనే వరద ప్రవాహంలో ఎంతోమంది కొట్టుకుపోవడం చూశానని రాజాసింగ్ చెప్పారు. తాము కూడా ప్రాణాలతో బయటపడతామో లేదో అని భయపడ్డామని తెలిపారు. సమయానికి గుర్రాలు దొరికడంతో తిరిగొచ్చామని తెలిపారు. మూడు గంటల తర్వాత కిందకు వచ్చామని చెప్పారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయం తెలుసుకొని అక్కడి పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్‌ వాహనంలో తమ కుటుంబ సభ్యులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారని రాజాసింగ్ వెల్లడించారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీరు, ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తనతో పాటు ఉన్న బృందం సురక్షితంగానే ఉందన్నారు. వరదలు వచ్చిన ప్రాంతంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వందలాది మంది యాత్రికులు అమర్నాథ్ లోనే ఉన్నట్లు సమాచారం. 

సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ని సంప్రదించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లు

011-23438252 మరియు 011-23438253

కాశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్, పుణ్యక్షేత్రం బోర్డు హెల్ప్‌లైన్‌  0194-2496240, 0194-2313149.

NDRF: 011-23438252, 011-23438253

Kashmir Divisional Helpline: 0194-2496240

Shrine Board Helpline: 0194-2313149

Joint Police Control Room Pahalgam 9596779039, 9797796217, 01936243233, 01936243018

Also read: YS Vijayamma: వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కుటుంబ కలహాలే కారణమా..?

Also read: Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News