హైదరాబాద్: టాలీవుడ్‌లో సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి అన్నంత పని చేసింది. గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె.. తనని చాలా మంది సినీ ప్రముఖులు అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆమరణ దీక్ష చేస్తానని.. అప్పటికీ దిగిరాకుంటే నగ్నంగా ఫిలిం నగర్‌లో నిలబడి నిరసన తెలుపుతానని హెచ్చరించింది ఆమె.
అన్నట్లుగానే ఈరోజు శ్రీరెడ్డి ఫిలింనగర్‌లో అర్థనగ్నంగా నిలబడి నిరసన తెలియజేసింది. శనివారం ఉదయమే శ్రీరెడ్డి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి, చుడీదార్ ధరించిన వస్త్రాలను పూర్తిగా తొలగించి..పొట్టి బట్టలతో తన నిరసన తెలిపింది. తర్వాత టాప్ తీసేసి.. కేవలం షార్ట్ తో రోడ్డుపై అందరూ చూస్తుండగా కూర్చుని ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.
'నాకు అన్యాయం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌లో నాకు సభ్యత్వం ఇవ్వడం లేదు. నాకు అన్యాయం చేస్తున్నారు. నా ఆవేదనను వ్యక్తం చేసినా సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ చర్యకు పూనుకొన్నాను' అని శ్రీరెడ్డి మీడియాకు తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ఛాంబర్ సభ్యులు ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ శ్రీరెడ్డి ససేమిరా అనడంతో పోలీసులు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ వద్దనే ఉన్నారు. ఏదో ఆవేశంలో ఇలా ఆమె మాట్లాడి ఉంటుందిలే అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ.. ఆమె ఈ చర్యకి పూనుకున్నారు. ఇప్పటికైనా సినీ పెద్దలు శ్రీరెడ్డి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పరిష్కరించకపోతే పరిస్థితి మరింత హెచ్చుమీరే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.
ఫిల్మ్‌నగర్‌లో నటి శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన