పటాన్చెరు: సంగారెడ్డి జిల్లాలో వింత చోటుచేసుకుంది. అదే సమయంలో ఏ జరిగిందో అర్థంకాక బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పటాన్చెరు మండలం పోచారం గ్రామపరిధిలోని గణపతిగూడెనికి చెందిన మల్లమ్మ అనే మహిళ కొన్నిరోజుల కిందట ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూనే కొన్ని రోజుల కిందట మల్లమ్మ చనిపోయింది. కుటుంబసభ్యులు వారి సంప్రదాయం ప్రకారం మల్లమ్మ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టి ఖననం చేశారు.
Read Also: దక్షిణ హైదరాబాద్‌పై ఎందుకీ నిర్లక్ష్యం: అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన
కాగా, మూడోరోజు కార్యక్రమం నిర్వహిద్దామని శ్మశానవాటికకు వెళ్లిన కుటుంబసభ్యులకు షాక్ తగిలింది. మృతదేహాన్ని శవపేటిక నుంచి బయటకు తీసి గుండు గీసినట్లు ఆమె కుమారుడు రాజు సహా కుటుంబం గమనించింది. అక్కడ తవ్వి మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే తల్లి మృతదేహాన్ని ఎవరు బటయకు తీశారు, శవానికి గుండు చేయాల్సిన అవసరం ఏంటో వీరికి అర్థం కాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.