గ్రేటర్ ‌హైదరాబాద్ ‌లో కరోనా విజృంభణ..

తెలంగాణలో కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,339 కు చేరింది.

Last Updated : Jun 30, 2020, 11:51 PM IST
గ్రేటర్ ‌హైదరాబాద్ ‌లో కరోనా విజృంభణ..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,339 కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఏడుగురు కరనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 1712 మంది మంది కోలుకోగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7,294కు చేరింది. 

Also Read: First vaccine: భారత్ లో తొలివ్యాక్సీన్ తీసుకునేది ఎవరు ?

కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 260కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 8,785 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నాడు 3,457 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 2,512 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్ ‌హైదరాబాద్‌లో అత్యధికంగా 869 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 12,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 29, మేడ్చల్‌లో 13, సంగారెడ్డిలో 21, కరీంనగర్‌లో 2, నిర్మల్ లో 4. మహబూబ్‌నగర్‌లో 2, సిద్దిపేటలో, సూర్యాపేట్, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. 
Also Read: Bihar Wedding: బీహార్ పెళ్లి వేడుకలో కరోనా: పెళ్లికొడుకు మృతి

Trending News