Whatsapp Update: బిగ్ అలర్ట్.. దీపావళి తరువాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్.. చెక్ చేసుకోండి

Whatsapp Stop Working: దీపావళి తరువాత కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 24వ తేదీలోపు అప్‌డేట్ చేయకపోతే వాట్సాప్‌ను ఇక నుంచి వినియోగించలేరు. ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 01:51 PM IST
  • అక్టోబర్ 24వ తరువాత నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు
  • ఆ లిస్టులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి
  • వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోండి
Whatsapp Update: బిగ్ అలర్ట్.. దీపావళి తరువాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్.. చెక్ చేసుకోండి

Whatsapp Stop Working: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఐఫోన్స్‌లో iOS 12 వర్షన్ రన్ చేయలేని ఐఫోన్స్‌లో అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్ ఆగిపోయే అవకాశం ఉంది. ఐఫోన్ 5, 5C వినియోగదారులు వాట్సాప్ వినియోగించడం కుదరదు. ఈ ఏడాది మే నెలలోనే ఈ విషయాన్ని వాట్సాప్ బేటా వెల్లడించింది. మీ ఐఫోన్స్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. 

'దురదృష్టవశాత్తూ కొన్ని అంతర్గత కారణాల వల్ల వాట్సాప్‌ను రాబోయే నెలల్లో కొన్ని iOS వెర్షన్స్‌లో నిలిపివేయాలని యోచిస్తోంది. మేము iOS 10, iOS 11 గురించి చెబుతున్నాం. వాట్సాప్‌ను కొనసాగించడానికి iOS తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి' అని ఓ స్క్రీన్‌షాట్‌ రిపోర్ట్‌ను వాట్సాప్ బేటా షేర్ చేసింది. అక్టోబరు 24 తర్వాత ఈ iOS వెర్షన్‌కు వాట్సాప్ సపోర్ట్ చేయడం ఆపివేస్తుంది.
 
ఆన్‌లైన్ మెసేజింగ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, iOS కొన్ని వెర్షన్‌లలో పని చేయడం ఆపివేస్తుంది. ఈ నేపథ్యంలోనే iOS 10, iOS 11, iPhone 5 iPhone 5C వర్షన్స్‌లో వాట్సాప్ పనిచేయదు. మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ ఐఫోన్‌ను iOS తాజా వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోండి. జనరల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. తరువాత సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌ను వినియోగంచుకోవచ్చు. 

'మేము మీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సేవలు నిలిపివేయాడానికి ముందు మీకు నేరుగా వాట్సాప్‌లో తెలియజేస్తాం. అప్‌గ్రేడ్ చేయమని కొన్నిసార్లు గుర్తు చేస్తాం. మీరు iOS 10 లేదా iOS 11ని ఉపయోగిస్తుంటే.. వాట్సాప్‌ను కొనసాగించడానికి మీరు iOS 12కి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. iPhone 5S, iPhone 6, iPhone 6 వినియోగదారులు వాట్సాప్‌ను ఉపయోగింవచ్చు. కానీ వారు iOS 12 వెర్షన్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది..' అని వాట్సాప్ మేనేజ్‌మెంట్ తెలిపింది. సో.. మీ ఫోన్స్‌ను వెంటనే iOS 12కు అప్‌గ్రేడ్ చేసుకోండి.

Also Read: Revanth Reddy: తెలంగాణ పీసీసీకి త్వరలో కొత్త చీఫ్? రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా!  

Also Read: Liz Truss Quits: బ్రిటన్ ప్రధాని పోటీలో మళ్లీ భారతీయుడు.. రేసులో ఉన్నది వీళ్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News