Vivo V29E Price: గణేష్‌ పండగ సందర్భంగా Vivo V29e మొబైల్‌పై 15 శాతం తగ్గింపు, అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

Vivo V29E Price: వీవో అధికారిక వెబ్‌సైట్‌లో Vivo V29e మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ నడుస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 12:06 PM IST
Vivo V29E Price: గణేష్‌ పండగ సందర్భంగా Vivo V29e మొబైల్‌పై 15 శాతం తగ్గింపు, అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..

 

Ganesh Chaturthi Offers On Vivo V29E Mobile: వినాయక చవితి సందర్భంగా అన్ని టెక్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్స్‌లో ఎలక్ట్రిక్‌ పరికరాలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అదిస్తున్నాయి. భారీ తగ్గింపుతో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. వీవో అధికారిక వెబ్‌సైట్‌లో ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Vivo V29e 8GB+128GB స్మార్ట్‌ ఫోన్‌పై వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక తగ్గింపును లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 15 శాతంకు పైగా తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో, ఏయే బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వివో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసిన తర్వాత ధర రూ.31,999తో మార్కెట్‌లో విక్రయించింది. అయితే వీవో వినాయక చవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై 15 శాతం తగ్గింపుతో కేవలం రూ.26,999కే అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్‌ను అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకుంటే HDFC, ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డులను వినియోగించి బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్‌ చెల్లిస్తే తక్షణంగా రూ. 2,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.24,999కే పొందవచ్చు. అంతేకాకుండా మరింత తగ్గింపు పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి భారీ తగ్గింపుతో ఈ మొబైల్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

Vivo V29e ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.78 అంగుళాలు AMOLED డిస్ప్లే
1080 x 2400 పిక్సెల్‌లు స్పష్టత
Android 13, Funtouch 13 OS
Qualcomm SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్
ఆక్టా-కోర్ సీపీయూ
అడ్రినో 619 జీపీయూ
LED ఫ్లాష్
64 MP బ్యాక్‌ కెమెరా
50 MP సెల్ఫీ కెమెరా
Li-Po 5000 mAh బ్యాటరీ
44W వైర్డు ఛార్జింగ్

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News