TVS iQube Sales in December 2022: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆటో కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో తమ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. మనం సాధారణంగా ఎక్కువగా మైలేజీ తక్కువ ధర ఉండే వెహికల్స్ కోసం చూస్తాం. ఆ కోవకే చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ గత ఏడాది మే లో రిలీజ్ అయింది. లాంచ్ చేసినప్పటి నుంచి ఈ స్కూటర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అదే టీవీఎస్ మోటార్ కంపెనీ చెందిన ఐక్యూబ్ ఈ-స్కూటర్.
2022 మే లో టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (TVS iQube Sales) అప్‌డేట్ చేసింది. మెుదట్లో ఈస్కూటర్ అమ్మకాలు సాధారణంగా ఉన్నా... రాను రానూ వీటి సేల్ విపరీతంగా పెరుగుతున్నాయి. డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. గత ఏడాది చివరి నెలలో 11,071 యూనిట్ల iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అమ్ముడయ్యాయి. అంతకుముందు 2022 సంవత్సరంలో నవంబర్‌లో 10,056 యూనిట్లు, అక్టోబర్‌లో 8,103 యూనిట్లు, సెప్టెంబర్‌లో 4,923 యూనిట్లు, ఆగస్టులో 4,418 యూనిట్లు, జూలైలో 6,304 యూనిట్లు, జూన్‌లో 4,667 యూనిట్లు, మేలో 2,637 యూనిట్లు, ఏప్రిల్‌లో 1,420 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
టీవీఎస్ ఐక్యూబ్ ఫీచర్లు
ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, S మరియు ST అనే మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ మరియు S వేరియంట్ 3.04 kWh లిథియం-అయాన్ బ్యాటరీ తో వస్తుండగా..టాప్-స్పెక్ ST వేరియంట్ 4.56 kWh బ్యాటరీను కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 100 కిమీ వరకు వస్తుంది. అయితే ఇది 145 కి.మీల రేంజ్ కూడా ఇస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 99,130 కాగా, 'ఎస్' వేరియంట్ ధర రూ. 1.04 లక్షలగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
TVS iQube E-Scooter: దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తెగ అమ్ముడుపోతుంది... ఎందుకో తెలుసా?