Smart TV : కేవలం రూ.3 వేల లోపు ఖర్చుతో ఏదైనా పాత టీవీ ని స్మార్ట్‌ టీవీగా మార్చేయండి..

Old TV : ఈ దీపావళికి మీ ఇంట్లో ఉన్న పాత టీవీని మార్చి కొత్త టీవీ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? ఎంత ఆన్లైన్ లో ఆఫర్లు నడుస్తున్నప్పటికీ ఇంట్లో ఉన్న టీవీని స్మార్ట్ టీవీ గా తక్కువ ఖర్చుతో మార్చుకోవటం బెటర్ అని నీకు అనిపిస్తుందా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. మీ ఇంట్లో ఉన్న పాత టీవీ ని స్మార్ట్ టీవీ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 01:59 PM IST
Smart TV : కేవలం రూ.3 వేల లోపు ఖర్చుతో ఏదైనా పాత టీవీ ని స్మార్ట్‌ టీవీగా మార్చేయండి..

Smart TV : ఈ ఏడాది దీపావళి సందర్భంగా మీ ఇంట్లో ఉన్న పాత టీవీని మార్చేసి కొత్త స్మార్ట్ టీవీ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ మూడు వేల లోపు ఖర్చు తోనే మీ ఇంట్లో ఉన్న పాత టీవీని స్మార్ట్ టీవీ గా మార్చొచ్చు అనే విషయం మీకు తెలుసా? నిజంగానే ఎలాంటి కష్టం లేకుండా చాలా సులువుగా నార్మల్ టీవీ ని స్మార్ట్ టీవీ గా మార్చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా..

ఇంట్లో ఉన్న పాత టీవీ ని ఆండ్రాయిడ్ టీవీ గా మార్చడం కోసం ఎన్నో రకాల టీవీ స్టిక్ లు మార్కెట్ లు అందుబాటులో ఉన్నాయి. కొత్త టీవీ కొనుగోలు చేయడం కంటే అలాంటి ఒక్క టీవీ స్టిక్ ను కొనుక్కొని మన టీవీని స్మార్ట్ టీవీ గా మార్చుకొని అందులోనే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్ లను సులభంగా వాడుకోవచ్చు.

అలాంటి ఒక టీవీ స్టిక్ ఎమ్ ఐ టీవీ స్టిక్. ఫ్లిప్కార్ట్ లో ఇది కేవలం 2999 రూపాయలకే దొరుకుతుంది. హెచ్ డీ ఎమ్ ఐ పోర్ట్ ద్వారా దీనిని టీవీకి కనెక్ట్ చేస్తే చాలు అప్పటిదాకా నార్మల్ టీవీ గా ఉన్నది కాస్త స్మార్ట్ టీవీ గా మారిపోతుంది. ఆ తర్వాత వైఫై సెటప్ చేసి ఆండ్రాయిడ్ టీవీ గా మార్చుకోవచ్చు. ఈ టీవీ స్టిక్ లో ఫుల్ హెచ్ డీ సపోర్ట్ కూడా ఉంది.

ఎమ్ ఐ టీవీ స్టిక్ లో ఉండే మరొక ఆసక్తికరమైన ఫీచర్ క్రోమ్ కాస్ట్. మన ఫోన్ లో మనం చూస్తున్న కంటెంట్ ని ఎలాంటి వైర్ సహాయం లేకుండా కేవలం క్రోమ్ కాస్ట్ సహాయంతో టీవీకి కనెక్ట్ చేసి ఫోన్ లో ఉన్న కంటెంట్ ను చూడొచ్చు.

అంతేకాకుండా ఈ టీవీ స్టిక్ తో పాటు ఒక రిమోట్ కూడా వస్తుంది. అందులో మన వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. మనకి కావాల్సిన సినిమా లేదా షో ని మైక్ సహాయంతో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టీవీలో ఓపెన్ చేయొచ్చు.

అతి తక్కువ ఖర్చుతోనే మీరు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి 5000 కంటే ఎక్కువ యాప్ లను యాక్సెస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే అమెజాన్ నుంచి ఫైర్ టీవీ స్టిక్ ఫోర్ కె ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు. దీని ధర కూడా 3199 మాత్రమే.

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News